గ్రీన్ ఇండియా చాలెంజ్ కు సంబంధించి తెలంగాణా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ చేస్తున్న ప్రచారం ఇప్పుడు హైలెట్ గా మారుతుంది. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు అందరూ ఈ చాలెంజ్ లో పాల్గొంటున్నారు. పార్లమెంట్ లో కూడా పలువురు ప్రముఖులు మొక్కలు నాటారు. తాజాగా గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొన్న నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ ఎంపీ సంతోష్ ని అభినందించారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ స్పూర్తితో అందరూ మొక్కలు నాటాలి అని కోరారు.

నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ ఢిల్లీ మోతిబాగ్ లోని తన నివాస ప్రాంగణంలో మూడు మొక్కలు నాటగా ఈ కార్యక్రమంలో ఎంపీ వెంకటేష్ నేత కూడా పాల్గొన్నారు. అనంతరం నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ కు రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ వృక్ష వేదం పుస్తకాన్ని బహుకరింఛి ధన్యవాదాలు చెప్పారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం, వృక్ష వేదం పుస్తక వివరాలు తెలుసుకొని ఎంపీ సంతోష్ కుమార్ ను అమితాబ్ కాంత్ ఈ సందర్భంగా  అభినందించారు. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ ఉద్యమం ముందుకు సాగాలని అమితాబ్ కాంత్ అనంతరం ఆకాంక్షించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ మహా హరిత ఉద్యమానికి శ్రీకారం చుట్టారని ఆయన అభినందించారు. ప్రతి గ్రామానికి ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్ళాల్సిన ఆవశ్యకత ఉందని అమితాబ్ కాంత్ అన్నారు. ఇదే విధంగా ముందుకు సాగితే తప్పకుండా పర్యావరణ మార్పులపై విజయం సాధించగలమని అమితాబ్ కాంత్ అభిప్రాయపడ్డారు. త్వరలోనే మరో ముగ్గురిని ఈ హరిత సవాల్ కి నామినేట్ చేస్తానని చెప్పారు ఆయన. ప్రతి ఒక్కరు పాల్గొని మొక్కలు నాటాలని కోరారు అమితాబ్ కాంత్. నీతి అయోగ్ సభ్యులను కూడా మొక్కలు నాటే విధంగా కోరతాను అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

trs