మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొన్న ఏపీ హోంమంత్రి సుచరిత డ్రగ్స్ వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేసారు. ఏపీలో మావోయిస్టు ప్రభావిత జిల్లాలు ఐదు నుంచి రెండుకి తగ్గాయి అని ఆమె పేర్కొన్నారు. విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలోనే కొంత మావోయిస్టుల ప్రభావం ఉంది అని ఆమె అన్నారు. 2019-21 లెక్కల ప్రకారం ఏపీలో 50 మంది మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం అని ఆమె తెలిపారు. ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పాలనా వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చారు అని అన్నారు.

వాలంటీర్ వ్యవస్థ ద్వారా గిరిజన ప్రాంతాల్లో పన్ను ప్రభుత్వ సర్వీసులు అందం అటువంటి ప్రాంతాల్లో కూడా సంక్షేమాన్ని అందించగలుగుతున్నాం అని ఆమె వెల్లడించారు. వెనుకబాటుతనం కారణంగా ఉద్యమాల్లోకి ఆకర్షితులయ్యే వారికి విద్య, వైద్య, మౌలిక సౌకర్యాలు మెరుగుపరచడం ద్వారా సమస్యకు పరిష్కారం చూపవచ్చన్నది ముఖ్యమంత్రి ఆలోచన అని ఆమె పేర్కొన్నారు. సమాజంలో ఉన్న అనగారిన వర్గాలకి విద్య వైద్యం అందించడం ద్వారా అనేక సమస్యలను పరిష్కరించవచ్చు అని ఆమె ఆకాంక్షించారు.

మారుమూల ప్రాంతాల్లో రోడ్డు సౌకర్యాలు, మౌలిక వసతుల కల్పనకి అనుమతులు,4 జి నెట్ వర్క్ కనెక్టివిటి, ఏకలవ్య విద్యాలయాల సంఖ్యను పెంచాలని హోంమంత్రిని కోరాం అని ఆమె పేర్కొన్నారు. మారుమూల ప్రాంతాల అభివృద్ధికి సహాయం చేస్తామని హోం మంత్రి హామీ ఇచ్చారు అని వివరించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మరిన్ని అదనపు బెటాలియన్స్ ఇవ్వాలని హోం మంత్రిని కోరాం అని అన్నారు. అటవీ ప్రాంతాల్లో రోడ్ల నిర్మణానికి సంబంధించి కేంద్ర హోంమంత్రి సానుకూలంగా స్పందించారు అని ఆమె తెలిపారు. ప్రతిపక్షాలు విమర్శలు చేయాలన్న కారణాలతోనే డ్రగ్స్ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు అని మండిపడ్డారు.

ఆశి ట్రెడర్స్ విజయవాడ కేంద్రంగా పనిచేయడం లేదు అని మీడియా వారే చెప్పారు అని ఆమె పేర్కొన్నారు. ఆశి ట్రేడర్స్ డ్రగ్స్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వమే కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలి అని కోరారు. సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ డ్రగ్స్ కి సంబందించిన వివరాలు పోలీసుల దృష్టికి తీసుకు రావాలి అన్నారు. విశాఖపట్నంలో గతం నుంచి నక్సల్స్ ప్రభావం ఉంది అని వెల్లడించారు. నక్సల్ ప్రభావానికి రాష్ట్ర రాజధాని అంశానికి సంబంధం లేదు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: