జగన్ సర్కార్ పై తెలుగు దేశం మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు  వంగల పూడి అనిత ఫైర్ అయ్యారు.   తన దోపిడీ, అక్ర మార్జన, అవినీతి కోసం ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రాన్ని డ్రగ్సాం ధ్రప్రదేశ్ గా మార్చా డని మండిపడ్డారు.   జగన్మోహన్ రెడ్డి, ఆయన అనుచరు లైన జగబన్లు కలిసి మద్యం,ఇసుక, భూమాఫియా, మాదకద్రవ్యాలతో రాష్ట్ర్నాన్ని కబళిస్తు న్నారని నిప్పులు చెరిగారు.  తన దోపిడీ కోసం ఈ ముఖ్య మంత్రి యువతీ యువకులను మత్తుకు బానిసల్ని చేస్తున్నాడని మండిపడ్డారు.   

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి 50 ఏళ్ల పాటు భవిష్యత్ అనేది లేకుండా చేస్తూ, యువతను మత్తు లో ముంచి తేలుస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.   ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో పట్టుబడిన 25 టన్నులు మాదకద్రవ్యాల చిరునామా విజయవాడ తో ఉంటే, ముఖ్యమంత్రి ఏమీ మాట్లాడడన్నారు  వంగలపూడి అనిత.  యువత నాశనమవుతున్నా, రాష్ట్రం చంకనాకి పోతున్నా ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు రాడని మండిపడ్డారు.  మాదక ద్రవ్యాల పై డీజీపీ, విజయవాడ సీపీ తమకేం సంబంధం లేదనడం సిగ్గు చేటు అని నిప్పులు చెరిగారు  వంగలపూడి అనిత.  

జగన్మోహన్ రెడ్డిని ఎలా కాపాడాలి.. ఆయన ఆస్తులను, అనుచరులను ఎలా రక్షించాలన్న అజెండా తోనే పోలీసులు పని చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు  వంగలపూడి అనిత.   యువత హెరాయిన్ వంటి మాదక ద్రవ్యాలకు బానిసలు అవ్వ బట్టే, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో ఆడ బిడ్డలు, మహిళల పై దారుణాలు పెరిగాయన్నారు.  యువతకు ఉపాధి, ఉద్యోగాలు కల్పించాల్సిన ముఖ్యమంత్రే తన సంపాదన కోసం వారిని మత్తు లో ముంచి తేలుస్తున్నాడని ఫైర్ అయ్యారు  వంగలపూడి అనిత.  పోలీసు లేమో ప్రతి పక్షానికి సుద్ధులు చెబుతూ, టీడీపీ నేతలను ఎలా అరెస్ట్ చేయాలన్న ఆలోచనలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు  వంగలపూడి అనిత.

మరింత సమాచారం తెలుసుకోండి: