జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమపై చేసిన విమర్శలకు గానూ మంత్రి పేర్ని నానీ సమాధానం ఇచ్చారు. ఏపీలో 1100 థియేటర్లు ఉంటే 800 థియేటర్లలో సినిమాలు నడుస్తున్నాయి అని అన్నారు ఆయన. పవన్ గొప్ప వ్యక్తిగా తనకు తాను ఊహించుకుంటూన్నారు అని ఎద్దేవా చేసారు. తెలంగాణలో 519 థియేటర్లు ఉంటే 419 సినిమా హాళ్లు మూసి ఉన్నాయని పవన్ తెలుసుకోవాలి అని ఆయన హితవు పలికారు. మూడు రోజుల నుంచి ఏపీలోని 510 థియేటర్లలో లవ్ స్టొరీ సినిమా ఆడుతుంది అని అన్నారు.

సినిమా పరిశ్రమను సీఎం జగన్ ఎటువంటి ఇబ్బందులు పెట్టారో చెప్పాలి అని ఆయన ప్రశ్నించారు. నేను పవన్ ఒకే కులం,నేను  సన్నాసి అయితే పవన్ కూడా సన్యాసే అని అన్నారు. మా వేదవన్నర వేదవ పవన్ ఏమి ఏమి మాట్లాడాడో అర్థం కావడం లేదు అన్నారు. సాయి ధరమ్ తేజ్ ప్రమాదాన్ని మధ్యలోకి ఎందుకు లాగావ్ అని నిలదీశారు. మీడియాను తిట్టే ముందు రోడ్లు సరిగ్గా లేవని కెసిఆర్ ను ప్రశ్నించు అంటూ ఆయన హితవు పలికారు. కెసిఆర్  పై నోరు తెరవాలి అంటే నువ్వు  ప్యాంట్లు తడుపుకుంటావ్ అన్నారు.

రిపబ్లిక్ ఇండియా అని పవన్ తెలుసుకోవాలి అని రిపబ్లిక్ ఇండియా కాబట్టే నువ్వు ఏదైనా మాట్లాడకలుగుతున్నావ్ అన్నారు ఆయన.  నీకు దమ్ముంటే తెలంగాణ పోలీసులను,తెలంగాణ ముఖ్యమంత్రిని తిట్టు అంటూ ఆయన హితవు పలికారు. కోడి కత్తి దాడి కేసుపై ఎన్ఐఏ విచారణ చేస్తుందని పవన్ తెలుసుకోవాలి అన్నారు. పవన్ కళ్యాణ్ కు దమ్ము ఉంటే కేంద్ర హోమ్ శాఖ మంత్రిని కలిసి కోడి కత్తి కేసు ఏమైందని ప్రశ్నించాలి అని హితవు పలికారు. మేము సంపాదించుకుంటే మీకు పన్నులు,జిఎస్టీ ఎందుకు కట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదే అని నిలదీశారు. మా ఎన్నికల్లో  ఓట్ల కోసమే నీ తిప్పలు అని అందరికి తెలుసు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap