సినీ పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలపై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను సంచలనంగా మారాయి. రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసలు తన సినిమా వకీల్ సాబ్ విడుదల కాకుండా ఉండే... పరిశ్రమపై ప్రభుత్వ విధానం మరోలా ఉండేదన్నట్లుగా పవన్ కామెంట్ చేశారు. అదే సమయంలో పరిశ్రమపై పెత్తనం చేసేందుకు ప్రభుత్వం చూస్తోందన్నట్లుగా పపన్ వ్యాఖ్యానించారు. వీటికి ప్రభుత్వం తరఫు నుంచి స్ట్రాంగ్ కౌంటర్ పడుతోంది. ఆన్ లైన్ టికెట్ల సేల్స్ విధానం అనేది పరిశ్రమ వైపు నుంచే వచ్చిందన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. ప్రస్తుతం పవన్ రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో చేసిన కామెంట్స్ చూట్టూనే అటు సినీ ఇండస్ట్రీ, ఇటు ప్రభుత్వం తరఫున నేతల మాటలు చక్కర్లు కొడుతున్నాయి.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేసిన చేసిన వాఖ్యలకు ప్రస్తుతం టాలీవుడ్ తరఫున సినీ పెద్దలు ఎవరూ స్పందించలేదు. ఇదే సమయంలో యువ హీరో, నేచురల్ స్టార్ నాని మాత్రం పవన్ వ్యాఖ్యలపై స్పందించారు. తన అభిప్రాయాలతో ట్వీట్ చేశారు నాని. ఏపీ ప్రభుత్వానికి మీకు మధ్య ఉన్న రాజకీయ విభేదాలు పక్కన పెట్టండి సార్ అంటూ ట్వీట్ చేశాడు నాని. పరిశ్రమ సమస్యలపై స్పెషల్ ఫోకస్ పెట్టండి... అన్ని సమస్యలకు త్వరగా పరిష్కారం చూపేలా దృష్టి పెట్టండి సార్ అంటూ నాని చేసిన పోస్ట్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. సినీ పరిశ్రమ కోలుకునేందుకు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా... త్వరగా చర్యలు తీసుకోవాలంటూ ఏపీ ముఖ్యమంత్రి, మంత్రులను కోరుతూ నాని వేడుకున్నారు. రిపబ్లిక్ సినిమా ఫంక్షన్‌లో ప్రసంగించిన పవన్... ఇటీవల టక్ జగదీష్ సినిమా ఫంక్షన్‌లో నాని చేసిన కామెంట్స్‌ను ప్రస్తావించారు. నానికి పవన్ మద్దతు ఇవ్వడం... ఇప్పుడు పవన్‌కు ఫేవర్‌గా నాని కామెంట్ చేయడం అటు పొలిటికల్‌గా... ఇటు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: