పీఎం కేర్స్ అంటే ఎవ‌రైనా ప్ర‌భుత్వ సంస్థ అని మాత్ర‌మే అనుకుంటారు. పైగా పీఎం పేరుతో ఉంది కాబ‌ట్టి ఇది ఖ‌చ్చితంగా గ‌వ‌ర్న‌మెంట్‌కు చెందిందే అనుకోవ‌డం త‌ప్పు లేదు. ఇటీవ‌ల కొవిడ్ మ‌హ‌మ్మారి స‌మ‌యంలో దీన్ని ప్రారంభించారు. దీని ద్వారా ప్ర‌జ‌లు, సంస్థ‌ల ద్వారా కొవిడ్ బాధిఉతుల‌కు క‌రోనా కార‌ణంగా ఉపాధి కోల్పోయిన వారికి స‌హాయం చేయ‌డాని ఫండ్‌ను కోరారు. అయితే, ఈ పీఎం కేర్స్‌లో ఎన్ని వేల కోట్లు జ‌మ‌య్యాయో ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రికీ తెలియదు. అలాగే, పీఎం కేర్స్ డ‌బ్బుల‌తో కొన్న మిష‌న్లు ఎంత కాలం ప‌ని చేస్తున్నాయో మ‌న కెవ‌రికీ తెలియ‌దు.


     అయితే, తాజాగా పీఎం కేర్స్‌పై వివాదం చెల‌రేగింది. ఢిల్లీ హైకోర్టులో కేంద్ర ప్ర‌భుత్వం, ప్ర‌ధాన మంత్రి కార్యాల‌యం ఒక అఫ‌డవిట్ వేసింది. ఇందులో ఏముందంటే పీఎం కేర్స్ ప్ర‌భుత్వ సంస్థ కాదని చెప్పేసింది. అస‌లు మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ దీన్ని ప్రారంభించిన‌ప్పుడు ఇది ఒక ప్ర‌భుత్వం సంస్థ అంటూ మొద‌లు పెట్టారు. ఇప్పుడు మాత్రం ఇది ప్ర‌భుత్వ సంస్థ కాద‌ని ప్ర‌క‌టించింది. ప్ర‌భుత్వ సంస్థ కాన‌ప్పుడు ప్ర‌భుత్వం రంగ సంస్థ‌ల నుంచి పెద్ద ఎత్తున పీఎం కేర్ కు ఎందుకు అందాయి?  ఇది ప్ర‌భుత్వ సంస్థ కాక‌పోతే పెద్ద స్కాం అవుతుంది అని మేదావు అంటున్నారు.

   
     కానీ, ఇది ఒక చారిట‌బుల్ సంస్థ దీనికి ప్ర‌ధాన‌మంత్రి ఎక్స్ అఫిషియో చైర్మెన్‌గా ఉన్నార‌ని, మ‌గ్గురు కేంద్ర మంత్రులు ట్రస్టీగా ఉన్నార‌ని ప్ర‌ధాన మంత్రి కార్యాల‌యం అఫిడ‌విట్ లో వెల్ల‌డించింది. అయినా, ఇది ప్ర‌భుత్వ సంస్థ కాద‌ట‌. మ‌రి ప్ర‌ధాన మంత్రి చైర్మెన్‌గా ఉన్న సంస్థ ప్ర‌భుత్వానిది కాక‌పోతే మ‌రి ప్ర‌ధాన మంత్రి ప్ర‌భుత్వ‌మా కాదా అనే ప్ర‌శ్నిస్తున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. వాస్త‌వంగా పీఎం రిలీఫ్ ఫండ్ ఉండ‌గా పీఎం కేర్స్ అవ‌ర‌సం లేదు.పీఎం రిలీఫ్ ఫండ్ ప్ర‌భుత్వ సంస్థ కాబట్టి దానికి ఆడిట్ ఉంటుంది. స‌మాచార హ‌క్కు చ‌ట్టం ద్వారా పీఎం రిలీఫ్ ఫండ్‌కు సంబంధించి అన్ని విష‌యాలు పొందొచ్చు. కానీ పీఎం కేర్స్  లోని ఏ విష‌యాన్ని మ‌నం తెలుసుకోలేం. దీని ద్వారా పీఎం కేర్స్‌లోని నిధులు ఏమ‌య్యాయో తెలుసుకోలేని ప‌రిస్థితి ఉంది. మ‌రి పీఎం పేరుతో చారిటీ పెట్టాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని మేధావులు ప్ర‌శ్నిస్తున్నారు.

 


    

మరింత సమాచారం తెలుసుకోండి: