తెలుగుదేశం పార్టీ పరిస్థితి ప్రస్తుతం అగమ్య గోచరంగా మారింది. 1982లో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాంగా మొదలైన టీడీపీ... ప్రస్తుతం ఆ పార్టీతోనే పొత్తు పెట్టుకుంది. 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేశాయి. ఇదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు తమ్ముళ్లకు మిగుడు పడటం లేదు. 2014 సార్వత్రికి ఎన్నికల్లో బీజేపీ, జనసేన పార్టీల మద్దతుతో అధికారం చేపట్టిన తెలుగుదేశం... 2019లో ఒంటరిగా పోటీ చేసి ఘోరంగా ఓడింది. అయితే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంపై పార్టీ నేతలు ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నట్లు కనబడుతోంది. చంద్రబాబు అనాలోచిత నిర్ణయాల వల్ల పార్టీలో కీలక నేతలు ఇప్పటికే ఇతర పార్టీల్లో చేరిపోయారనేది ప్రధాన ఆరోపణ. నాడు రెండు కళ్ల సిద్ధాంతం వల్లే తెలంగాణలో పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందంటున్నారు సొంత పార్టీ నేతలు.

ఇప్పుడు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేస్తున్నారు పార్టీ సీనియర్ నేతలు. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్లు బుచ్చయ్య చౌదరి, విజయవాడ పార్లమెంట్ సభ్యుడు  కేశినేని నాని కూడా ఇదే మాట చెప్పకనే చెబుతున్నారు. పార్టీ నాయకత్వం మార్పు కోరుతుంది అంటూ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి బహిరంగంగానే వ్యాఖ్యానించారు. అసలు పార్టీకే రాజీనామా చేస్తానంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఈ ఏపిసోడ్ వారం రోజులు గడిచింది. పార్టీ పెద్దలు బుజ్జగించిన తర్వాతే బుచ్చయ్య వెనక్కి తగ్గారు. ఇప్పుడు ఎంపీ కేశినేని నాని కూడా కామెంట్ చేయడం సర్వత్రా హాట్ టాపిక్‌గా మారాయి. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కీలక నేతలు ఒక్కొక్కరుగా దూరమవుతున్నారు. ముందుగా వల్లభనేని వంశీ, ఆ తర్వాత కరణం బలరాం, దేవినేని అవినాష్... ఇలా గతంలో చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తిన వారే... ఇప్పుడు ఆయనపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. పరిస్థితి చూస్తుంటే... టీడీపీలో చంద్రన్న పట్టు తప్పుతున్నట్లే ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: