ఢిల్లీ :  ఉత్తర ప్రదేశ్ క్యాబినెట్ విస్తరణ మరికా సేపట్లో కానుంది.  సాయంత్రం ఆరు గంట లకు కేబినెట్ విస్తరణ చేపట్టనున్నారు యుపి సీఎం యోగి ఆదిత్యనాథ్.  ఉత్తర ప్రదేశ్  ఎన్నికలకు ముందు ఖాళీగా ఉన్న ఆరు స్థానాలను భర్తీ చేయనున్నారు ఆ రాష్ట్ర  సీఎం యోగి ఆదిత్యనాథ్.  ఇప్పటికే కేబినెట్ విస్తరణ గురించి అమిత్ షా, జెపి నడ్డా తో చర్చించిన సీఎం యోగి ఆదిత్యనాథ్.. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది.  ఉత్తర ప్రదేశ్ లో ప్రస్తుతం 54 మంత్రులు ఉండగా..మరో ఆరుగురిని మంత్రి వర్గంలోకి తీసుకోనున్నారు సీఎం యోగి ఆదిత్యనాథ్.  

ప్రస్తుతం యోగి మంత్రి వర్గం లో 23 మంది కేబినెట్ మంత్రులు, 9 మంది స్వతంత్రులు, 22 మంది సహాయ మంత్రులు ఉన్నారు.  ఇక మంత్రిత్వ శాఖ ల్లో మార్పులు చేయకుండా కేవలం ఖాళీలను మాత్రమే భర్తీ చేయనున్నారు సీఎం యోగి ఆదిత్యనాథ్.  2017 లో ప్రభుత్వ ఏర్పాటు తరువాత రెండో సారి మంత్రి వర్గ విస్తరణ చేపట్టిన సీఎం యోగి ఆదిత్యనాథ్ .. మొదటి సారి 2019 ఆగస్టు 22 న జరిగిన మంత్రి వర్గ విస్తరణ చేయనున్నారు.  కరోనా కారణం గా ముగ్గురు యుపి మంత్రులు చనిపోయారు. వారి స్థానాల్లో కూడా మరో ముగ్గురు కొత్త వారిని తీసుకొనున్నారు సీఎం యోగి ఆదిత్యనాథ్.

ఈ సారి.. ఏకంగా ఖాళీగా ఉన్న ఆరు స్థానాలను భర్తీ చేయనున్నారు ఆ రాష్ట్ర  సీఎం యోగి ఆదిత్యనాథ్. దీంతో ఆశ వాహులలో కొంత ఆందోళన మొదలైంది. ఎవరికి అవక్షం వస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని  ఈ మంత్రి  వర్గ విస్తరణను చేపట్టనున్నారు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ . అయితే ఇప్పటివరకూ అసలు ఆ ఆరుగురు మంత్రులు ఎవరనేది ఇంకా తెలియరాలేదు. చాలా  సీక్రెట్ గా ఆ జాబితాను ఉంచారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.

మరింత సమాచారం తెలుసుకోండి: