దేశంలో న్యాయ వ్యవస్థ కూడా ఒకళ్లకింద పనిచేస్తూ బయటకు మాత్రం స్వతంత్ర శాఖగా చలామణి అవుతుందని ఆయా దర్యాప్తు లను బట్టి స్పష్టం అవుతుంది. రాజకీయాలలో పట్టు ఉన్నవాళ్లు ఈ వ్యవస్థను తమ పక్క దుప్పటిగా వాడేసుకుంటున్నారు. అందుకే న్యాయం జరగటం లేదు అనే నమ్మకం రానురాను యువతలో పెరిగిపోతుంది. అదే వారిని ఇతర మార్గాలవైపు మళ్ళిస్తుంది. వ్యవస్థలో లోపాలు ఉండొచ్చు కానీ, లోపాలతో వ్యవస్థలు ఒంటికాలుతో నడవడం సాధ్యం కానీ పని. అదే ఇప్పటి సమాజంలో జరుగుతుంది. కేవలం రాజకీయాల కోసం తప్ప న్యాయవ్యవస్థ మారేందుకు ఉపయోగపడటం లేదు.

అందుకే చాలా కేసులలో నిజానిజాలు తేలడం కన్నా న్యాయం దాటేయడానికే ఎక్కువ ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొందరిని బెదిరించి పనులు చేయించుకోడానికి తప్ప న్యాయ వ్యవస్థ పనిచేయడం లేదు. ఇది దేశానికి, దేశ భవిష్యత్తుకు మంచిది కాదు. అయినా అవన్నీ ఆలోచించలేని రాజకీయ నేతలు తాత్కాలికంగా నిర్ణయాలు తీసుకుంటూ నిజమైన దేశద్రోహులుగా మిగిలిపోతున్నారు. నల్లకోటు వేసుకొని న్యాయాన్ని కాపాడతాను అని ప్రమాణం చేసిన వాళ్ళు దానిని చంపేయడానికే ఎక్కువగా పని చేస్తున్నారు. పెత్తందారుల కబంధ హస్తాలలో నలిగిపోయిన బలిపశువులుగా న్యాయాన్ని కోరే వారి పరిస్థితి మారిపోయింది.

ఉదాహరణకు ఏపీలో అధికార పార్టీ నేత అక్రమ ఆస్తులను గురించి మాట్లాడినంతగా ప్రతిపక్ష నేత అక్రమ ఆస్తుల గురించి ఎందుకు మాట్లాడరు. ఎందుకంటే ఆయన వ్యవస్థలను ఇష్టానికి వాడుకునే తెలివితేటలూ ఉన్నవాడు. అంటే న్యాయ వ్యవస్థను కూడా ఒక మాజీ ముఖ్యమంత్రి శాసిస్తున్నాడనే కదా. ఇలాంటి వాళ్ళ కబంధ హస్తాలలో న్యాయ వ్యవస్థ నడుస్తూ ఉంటె న్యాయం కూడా అన్యాయం గా కనిపించడం సహజమే. అదే జగన్ విషయంలో కనిపిస్తుంది. ఆయన మీద ఎవరో కేసులు పెట్టారు కాబట్టే వాటిని విచారిస్తాం, బాబు గారి గురించి ఎవరు కేసులు పెట్టలేదు కాబట్టి ఆయన దొంగైనా, అది న్యాయ వ్యవస్థకు తెలిసినా మౌనంగా ఉండి తమ బాధ్యత నుండి తప్పించుకుంటాం అంటారు అంతేగా.. ఎందుకంటే వాళ్లకు పరిధి ఉంటుంది అనే లూప్ హోల్ ఇక్కడ చక్కగా వాడేసుకుంటున్నారు.  ఇదేనా సమసమాజానికి ఒక న్యాయ వ్యవస్థ చెప్పాల్సిన వివరణ. అక్రమ ఆస్తులు ఉంటె శిక్షించండి, మరి అప్పుడు అవి ఉన్న వారందరిని కోర్టులు శిక్షించాలి మరి. ఏవేవో కారణాలు చెప్పి దశాబ్దాలు సాగబీకి తప్పించుకు తిరిగే న్యాయ వ్యవస్థ ఎవరికీ న్యాయం చేయలేదు, చేయదు కూడా! ఇదే నేటి భారతం, న్యాయం లేని అన్యాయ స్థానాలు మాత్రమే ఉన్న వ్యవస్థే ఈ దేశం అని సామాన్యుడికి ఇప్పటికే ఒక భావన వచ్చేసింది. అయినా మారరు!

మరింత సమాచారం తెలుసుకోండి: