దేశంలో వ్యవస్థలను తమకు అనుకూలంగా వాడుకునే వాళ్ళ సంఖ్య ఘననీయంగా పెరుగుతుంది. దీనితో సామాన్యులకు న్యాయవ్యవస్థ మీద, న్యాయం మీద నమ్మకం సన్నగిల్లిపోతుంది. ఇప్పటి వరకు న్యాయ వ్యవస్థ ఎంతమంది రాజకీయ నేరస్తులను శిక్షించగలిగింది. అందులో ఏ దర్యాప్త సంస్థ న్యాయంగా విచారణ చేసింది.. లాంటి సామాన్యుడి ప్రశ్నలకు ఎవరు సమాధానం చెప్పగలుగుతున్నారు. పేరుకే ప్రజాస్వామ్యం ఉన్నదంతా పెత్తందార్ల జాగిరి మాత్రమే. ప్రస్తుత పరిస్థితులు చుస్తే అదే నిజం అనిపిస్తుంది ఎవరికైన. అందుకే ఎప్పటికప్పుడు కఠినమైన చట్టాలు చేస్తున్నప్పటికీ నేరస్తులు తమకు తప్పించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే నమ్మకంతో నిర్భయంగా నేరాలు రోడ్డుపైనే అది కూడా జనారణ్యంలోనే.. తాజాగా కోర్టులలోనే నేరాలు చేస్తున్నారు.

ఇది చాలదు వ్యవస్థలు పెత్తందార్ల చేతిలో కీలుబొమ్మలుగా మారిపోయాయని. అధికార మదం, డబ్బు మదం కలిసి దేశంలో వ్యవస్థలను తమకు అనుకూలంగా మార్చేసుకున్నాయి. అందుకే వీళ్ళ సమాజంలో ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళకి ఒక రకంగా న్యాయవ్యవస్థ స్పందిస్తుంది, ఎందుకంటే వాళ్ళు ఆ వ్యవస్థలోని లూప్ హోల్స్ కనిపెట్టి మరి వాడేసుకుంటున్నారు. ఇక సామాన్యుడు పొరపాటున నేరం చేస్తే వాళ్ళను కుక్కల్లా ఈడ్చుకుపోతారు. వాళ్ళు పెద్ద పెద్ద లాయర్లను భరించలేరు, వాళ్ళకోసం ఎవరైనా వచ్చినా వాళ్ళని బ్రతకనివ్వరు, అందుకే వాళ్ళు న్యాయాన్ని చంపలేక జైళ్లలో మగ్గిపోతారు. అందుకే కోర్టులలో మగ్గిపోతున్న కేసులన్నీ పరికిస్తే ఎక్కువ కేసులు బలిసిన వాళ్ళ సమాజం వాళ్ళవే ఉంటాయి.

ఏపీలోనే చూడండి, ఒకాయన అధికారంలో ఉన్నా కేసులు ధైర్యంగా ఎదుర్కొంటు పాలన సాగిస్తున్నాడు. ఇంకో ఆయన కేసులకు స్టే లు తెచ్చుకుంటూ ఉన్నాడు. ఈయన అన్నదే ఒక మాట గుర్తుచేసుకోవాలి. నేను .. కోర్టులకు దొరకను అన్నాడు. అంటే దొంగే అనే కదా! దీనికి ఏ న్యాయవ్యవస్థ స్పందించదు, కారణం తెలిసిందే. ఆ సారు వాటిని చక్కగా వాడేసుకుంటూ బ్రతికేస్తున్నాడు. ఇక్కడ వ్యక్తి తప్పు ఎంత ఉందొ వ్యవస్థ తప్పు కూడా అంతే ఉంది. కొందరు న్యాయవ్యవస్థలో లూప్ హోల్స్ వాడుకుంటూ న్యాయాన్ని చంపేస్తున్నారని తెలిసినా మౌనంగా ఉండే న్యాయవ్యవస్థ ఉన్నా ఊదినా పెద్దగా దేశానికి ఒరిగేది ఏమి ఉండదు. ఇలాంటి నేరస్తులను తక్షణమే శిక్షించ గలిగిన రోజు ఈ దేశంలో న్యాయ వ్యవస్థ బ్రతికే ఉందని చెప్పడానికి నిదర్శనం. అప్పటి వరకు ఉమ్మితే ఊడే ముక్కు లా ఏదో ఉందిలే అన్నట్టు ఉంటుంది అంతే.

మరింత సమాచారం తెలుసుకోండి: