పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సినిమా నటుడు కమ్ పొలిటీషియన్. పవన్ లో ఫోర్స్ ఉంది. సినిమాలలో మాస్ కి ఆయన్ని దగ్గర చేసిన క్వాలిటీ అదే. ఇక రాజకీయాల్లో కూడా పవన్ జోరు చాలానే ఉంది.


అయితే పవన్ అన్న చాటు తమ్ముడిగా ప్రజారాజ్యం లో చేరి రాజకీయ అరంగేట్రం చేశారు. నాడు ఆయన యువ రాజ్యం అధినేతగా పంచెలూడగొడతాను అన్న డైలాగ్ అప్పట్లో ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టించింది. అది అలా ఉంటే నాడు  పంచె కట్టిన రాజకీయ నేతగా వైఎస్సార్ సీఎం గా ఉండేవారు. ఆయన్ని ఉద్దేశించి పవన్ డైలాగులు కొట్టారని అనుకున్నారు. ఆ తరువాత సీన్ కట్ చేస్తే ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం కావడంతో కొన్నాళ్ళు పవన్ సైలెంట్ అయ్యారు.


విభజన తరువాత ఆయన మళ్లీ జనాల్లోకి వచ్చారు. ఆయన 2014 ఎన్నికలకు ముందు జనసేనను స్థాపించారు. ఆ ఎన్నికల్లో పవన్ పోటీ చేయకుండా బీజేపీ, టీడీపీకి మద్దతు ప్రకటించారు. అలా ఆ రెండు పార్టీలు అధికారంలోకి రావడానికి కృషి చేసిన పవన్ జగన్ని అధికారానికి దూరం పెట్టగలిగారు. 2019లో ఇదే రకమైన స్ట్రాటజీ ఆయన చేయాలనుకున్నా వర్కౌట్ కాలేదు. మొత్తానికి జగన్ సీఎం అయిపోయారు. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటి అంటే పవన్ ఎపుడూ జగన్ మీద దూకుడు చేస్తారని.


ఎందుకో కానీ జగన్ అంటే పవన్ మొదటి నుంచి గట్టి వ్యతిరేకతతోనే ఉన్నారని చెబుతారు. జగన్ని విమర్శించడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా ఆయన వదులుకోలేదు. ఈ మధ్యనే వైసీపీ పాలన మీద దారుణమైన కామెంట్స్ చేసిన ఆయన ఒక సినిమా ఫంక్షన్ లో ఏకంగా వైసీపీని గట్టిగా టార్గెట్ చేసారు. తాట తీస్తామంటూ ఆయన వాడిన డైలాగులు మళ్ళీ పొలిటికల్ గా  జగన్ వర్సెస్ పవన్ గా మారుతున్నాయి.  2024 ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు అన్నది పక్కన పెడితే జగన్ని మాత్రం మరో మారు సీఎం సీటు ఎక్కకుండా చేయడానికి పవన్ రెడీ అయిపోయారు అన్నది మాత్రం తెలుస్తోంది. మరి ఈ పోరులో విజేతలు ఎవరు అవుతారు అన్నది వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: