ఏపీలో అధికార పార్టీ వైసీపీ తన మార్క్ చూపిస్తూ చెప్పింది చేస్తూ ప్రజాక్షేత్రంలో రోజురోజుకు అభిమానులను పెంచుకుంటూ పోతుంది. కరోనా సమయంలో ఈ ప్రభుత్వం అందించిన అనేక పథకాలతో ప్రజలు ఎన్నో ఇబ్బందుల నుండి బయట పడ్డారు. ఒకపక్క విపక్షాలు అర్ధం లేని కేసులతో ప్రతిదానికి అడ్డుపుల్ల వేస్తున్నప్పటికీ తన పని తాను చేసుకుంటూ పోతుంది ప్రభుత్వం. ఎప్పుడైనా చేయాల్సిన పని ఈ కేసులతో ముందుకు వెళ్లకపోతే దానిని గురించి స్వయంగా సీఎం జగన్ ప్రజలకే చెప్తూ ఉన్నారు. దీనివలన ప్రభుత్వం తప్పు లేదని ప్రజలు కూడా ఎప్పటికప్పుడు అర్ధం చేసుకుంటూ ఉన్నారు.

దాదాపుగా తెలంగాణ లో మాదిరిగానే సరైన ప్రతిపక్షం లేని పార్టీగా వైసీపీ ముందుకు పోతుంది. అందుకని అధికారం వచ్చింది ఇక మన ఇష్టం అన్న చందాన కాకుండా స్వయంగా సీఎం జగన్ నేను మీకు సేవకుడినే అని చెప్తూ ప్రజలకు చేయాల్సినవి చేస్తూ పోతున్నారు. దీనితో ప్రతిపక్షాలు కూడా ఎన్ని ప్రణాళికలు వేస్తున్నా తమ గ్రాఫ్ పెంచుకోలేకపోతున్నారు. కొందరికి అవకాశం కాస్త ఉన్నప్పటికీ వాళ్ళు పనికిమాలిన వాళ్ళతో కూటమిగా ఉండటంతో ప్రజలు పట్టించుకోవడం మానేశారు. అయినా ఎక్కడ అహంకరించకుండా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాడు ఎలా ఉందొ ఇప్పుడు కూడా అదే తరహాలో ప్రజాసేవ చేసుకుంటుంది.

ఈ రాష్ట్రంలో చెప్పుకోదగ్గ పార్టీ గా ఉన్న ఒకే ఒక పార్టీ జనసేన. దీని అధినేత కు ప్రతిపక్ష నేతగా ఉండే అవకాశం అయినా ఉంది, కానీ ఆయన అధికారం మాత్రమే కావాలి  అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఆ రోజు వచ్చేదాకా తనపని తాను చేయాలి అనేది ఆయన మరిచిపోతున్నారు. ఉదాహరణకు అనుకుంటే ఆయనకు అధికారం నిజంగా వస్తే ఏమి చేస్తాడు! ఆ విధమైన మేనిఫెస్టో ఇంతవరకు చెప్పనేలేదు. ప్రజాసమస్యలు తెలుసుకోవడం చాలా సులువే, కానీ వాటిని శాశ్వతంగా పరిష్కరించడానికి ఏమేమి చేయాలో ఒక రాజకీయ నేతగా ఆయనకు ఉన్న ఆలోచనలు ఏమిటి అనేవి కూడా ఇంతవరకు ప్రజలతో పంచుకోలేదు. అంటే ఆయన రావటంతోటే ప్రజలు లేదా అభిమానులు తనను గెలిపించి సీఎం పదవి ఇస్తారు.. ఆ పదవి ఎంజాయ్ చేస్తూ ఉండవచ్చు.. అధికారం ఉంది కాబట్టి ఆ మదంతో తాను ఏది కావాలో అది దక్కించుకోవచ్చు అనేది ఆయన ఆలోచనలుగా భావించవచ్చు అంటున్నారు నిపుణులు. ప్రజలకు ఏమేమి చేయాలి అనే కనీస ఆలోచన లేకుండా ఎవరు రాజకీయాల్లోకి వచ్చినా వాళ్ళు కేవలం అధికారం కోసమే, అది దక్కినా వాళ్ళు ముందస్తు ప్రణాళిక లేదు కాబట్టి ఏమి చేయలేరు కూడా. మరి ఇంకెందుకు మనకు ఇలాంటివాళ్ళు అనే ప్రజలు ఆలోచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: