కష్టపడితే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అని ఎంఐఎం నిరూపిస్తుంది. కేవలం తెలంగాణ లో హైదరాబాద్ కు పరిమితమైన ఈ పార్టీ నేడు ఎన్నో చిన్న పార్టీలను దాటుకొని జాతీయ పార్టీగా గుర్తింపు పొందుతుంది. ఎక్కడ ఎన్నికలు జరిగినా తామున్నాం అంటూ ఎంఐఎం ఆయా రాష్ట్రాలలో తమ వర్గం వారికి అండగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని సార్లు ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ, చాలాసార్లు తమ వారికి అండగా ఉండగలుగుతున్నారు. ఇది కేవలం కష్టపడటం తో మాత్రమే సాధ్యం చేస్తూ ఎన్నో పార్టీలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. రాజకీయాలలో పార్టీ పెట్టగానే అధికారం తెచ్చుకున్న వారు అతితక్కువ. అలాగే మేము పొడిచేస్తాం అంటూ పార్టీ పెట్టి ఫలితమే లేకుండా కనుమరుగైన పార్టీలు కూడా లేకపోలేదు. కానీ ప్రజాసేవ చేయాలనే ఉత్సాహంతో ప్రజల ఆదరణ కోసం అధికారంలో ఉన్నా లేకున్నా తమ సేవాతత్పరతతో ముందుకు సాగిన వారు మాత్రం ఏదో ఒక రోజు ప్రజలు అండగా ఉంటారు.

ఇదే తరహాలో ఎంఐఎం పుట్టింది, ఎన్నో దెబ్బల అనంతరం గెలుపు అంచులు తాకింది. అప్పటి నుండి తమ వారికి అండగా ఉంటూ వస్తూనే ఉంది. తాజాగా ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఈ పార్టీ పోటీకి దిగటం ద్వారా అక్కడ ఉన్నవారికి అండగా ఉంటామని స్పష్టం చేస్తుంది. దీనితో ఆ రాష్ట్రంలో అధికార పార్టీ సహా పలు పార్టీలు తలలు పట్టుకుంటున్నాయి. ఎందుకంటే అక్కడ మైనారిటీ లు గెలుపును నిర్ణయించగల స్థాయిలో  ఉన్నారు. వీళ్ళ ఓట్లు ఎంఐఎం కాజేసినా లేక చీల్చినా ఇతర పార్టీలకు ఓటమి లేదా హంగ్ తప్పదు. తద్వారా ఏవిధంగా అయినా ఎంఐఎం విజయం సాధించినట్టే.

అయితే ఎంఐఎం కేవలం బీజేపీ వెనక ఉండి నడిపిస్తున్న తోక పార్టీ అని విపక్షాలు గొల్లుమంటున్నాయి. బీజేపీ రాష్ట్ర ఎన్నికలలో ఎంఐఎం ను దించడం ద్వారా ఓట్ల చీలిక జరిపి గెలుపు అవకాశాలు పెంచుకుంటుందని వారు విమర్శిస్తున్నారు. రాజకీయాలలో అది ఎన్నికల సమయంలో వ్యూహప్రతివ్యూహాలు సహజం. ఎంఐఎం బీజేపీ తెచ్చిపెట్టిన పార్టీనా లేక అదే పోటీకి దిగుతుందా అనేది పక్కన పెడితే ఓట్ల చీలిక మాత్రం తప్పదు. అది లభించి ఎంఐఎం కీలకం అవ్వొచ్చు అనేది ఇక్కడ ముఖ్య విషయం. ఉత్తరప్రదేశ్ లో 403 స్థానాలు  ఉండగా ఎంఐఎం 100 స్థానాలలో పోటీకి దిగుతుంది. అంటే చీలిక పెద్ద స్థాయిలోనే ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: