తెలంగాణాలో ఉపఎన్నిక వేడి రోజురోజుకు పెరిగిపోతుంది. ఒక్క హుజురాబాద్ కోసం పార్టీలు అన్ని ప్రాణం పెట్టేస్తున్నాయి. అధికార పార్టీ కూడా ఎక్కడా తగ్గకుండా వరాల జల్లు కురిపించేస్తుంది. ఎప్పుడూ ఫామ్ హౌస్ లో ఉండే కేసీఆర్ కూడా అప్పుడే రెండు సార్లు హస్తినకు వెళ్లి వెళ్ళాడు. దళిత బందు పథకం తెచ్చేశాడు. సభలు, సమావేశాలతో బిజీగా తిరుగుతున్నాడు. మరి ప్రజలకు కేసీఆర్ తమకోసమే తిరుగుతున్నట్టు తెలియాలి కదా! ఇక కేసీఆర్ కాస్త పనిలో పడగానే హుజురాబాద్ లో ఎన్నికల ప్రచారం మాత్రం ఆగకూడదు కాబట్టి (మళ్ళీ ప్రజలు తెరాస ను మరిచిపోకుండా) కేటీఆర్ లేదా హరీష్ రావు లు అక్కడ ప్రత్యక్షం అవుతున్నారు.

ఓటరులారా ఇప్పుడే బాగా ఆలోచించుకోండి..ఎన్నికల సమయం లోనే మీకు ముఖం కనిపిస్తుంది, ఎవరిది కేసీఆర్ ది; ఎన్నికల కోసమే బయటకు వచ్చిండు; ఎన్నికలనే పధకాలు, అదికూడా కొత్తవి (పాతవి చెప్పి చెప్పి మళ్ళీ అవే చెప్తే వాటిని ఇవ్వలేదనే జ్ఞాపకం వస్తుందని) మీకోసమే అంటూ తెస్తున్నాడు; పది లక్షలు అంటున్నాడు; ఇంకా ఎన్నో గడప గడపకు వచ్చేస్తున్నాయి. ఇవన్నీ కేవలం ఎన్నికల వలన వస్తున్నాయి కానీ మీ కోసం కాదు అని గుర్తించండి. మీరు తెలివి మీరిపోయారు, వాళ్ళు ఇచ్చేవన్నీ తీసుకోని మీకు ఇష్టమైన వాళ్లకు ఓటు వేస్తున్నారు(ఇదికూడా ఆరోగ్యం కాదు మీకు). మీరు మారండి, నేతలను మార్చండి!

కేవలం ఎన్నికలకు మాత్రమే నేతలు ప్రజల ముందుకు వచ్చి సమస్యలు అడిగిపోతారు తప్ప గెలిచిన తరువాత ఒక్కడు కనిపించడు.. ఇదో పాత సినిమా లోని డైలాగు. రాజకీయ నేతలు కూడా సినిమాలు చూస్తున్నారు, అవన్నీ ఓయ్ ఓటరు నీమీద ప్రయోగిస్తున్నారు.. మేలుకో! అలా ఇప్పుడు మీ వద్దకు వచ్చిన నేతలను నిన్నటి వరకు ఎక్కడ ఉన్నావ్ అని అడుగు..; మళ్ళీ గెలిపిస్తే ఈసారి ఎన్నికల అప్పుడే కదా ఇలా ముఖం చూపించేది అని అడుగు..; పధకాలు పొందటానికి నాకు అర్హత ఉంది కానీ ఇంకా రాలేదు  ఎందుకో చెప్పు అని అడుగు..; రాష్ట్రం ఒక్కటిగా ఉన్నప్పుడు లక్ష కోట్ల బడ్జెట్ సరిపోయింది, ఇప్పుడు రాష్ట్రం చిన్నది అయినా రెండున్నర  కోట్ల బడ్జెట్ ఎందుకు సరిపోవడంలేదో అడుగు..; ఓటేసి గెలిపిస్తే, ఆ మరుక్షణమ్ నుండే  ప్రాంతం లో ఉండి సమస్యలు అన్ని తీర్చి పోతావా అని అడుగు..వీటికి సమాధానం చెప్పి అప్పుడు వెళ్ళమని అడుగు..!

మరింత సమాచారం తెలుసుకోండి: