జనసేన పార్టీ ఆవిర్భావం జరిగి ఏళ్లుగడుస్తున్న సేనాని లో మాత్రం రాజకీయ నాయకుడు కనిపించడం లేదు. తానే అన్ని అయ్యి ముందు ఉండాల్సిన వాడు తప్పుకుని తిరుగుతూ ఉంటె సేన తమ సొంత కృషితో చిన్న చిన్న విజయాలు పార్టీ కి సాధించి పెడుతున్నారు. అయితే ఈ పార్టీ ఆవిర్భావం కూడా ఎన్నో ఒత్తిళ్ల మధ్య జరిగింది, కొందరు ఎందుకు నీకు రాజకీయాలు అన్నారు అయినా వినిపించుకోలేదు, ఇంకొందరు ఇప్పుడే ఎందుకు అన్నారు అయినా వినిపించుకోలేదు, తానే స్వయంగా అన్ని చేసుకోనైనా మొదలు పెడతాను అన్నాడు, చేశాడు. కానీ కొందరు ప్రారంభం మాత్రమే ఆలోచించి పనులు హడావుడిగా మొదలు పెడతారు, కానీ ఆ తరువాత ఏమి చేయాలో తెలియక మిగిలిన వారిమీద తోసేసి తాము తప్పించుకుంటారు. అది వాళ్ళ  నైజం, చెప్పిన వినరు, పట్టించుకోరు.

ఇదే నేపథ్యంలో జనసేన ఆవిర్భావం జరిగింది, ప్రశ్నించడానికే వచ్చాను తప్ప అధికారం కోసం కాదు అంటూ ఆర్భాటంగా ఆ వేడుక ముగిసింది, అంతటితో అంతా సరి. అక్కడ అంత ఉత్సాహంతో ఊగిపోయిన సేనాని ఎవరు దువ్వారో మరి చల్లబడ్డాడు. సేనకు అర్ధం అయ్యింది ఏమి జరిగిందో అని, అనవసరపు పొత్తులకు పోయి ఎన్నికలకు పోటీ చేయకుంటే నష్టపోతాం అని నచ్చజెప్పబోయారు. కానీ అక్కడ బాగా ఎక్కించేశారేమో అభిమానులు చెప్పినవి అస్సలు ఎక్కలేదు. అంతే అనే పార్టీకి అన్ని, తాను చెప్పిందే నిబంధన, తాను చేసిందే శాసనం అంటూ పోటీ నుండి తప్పుకుంటున్నట్టు ప్రకటన చేసేసి, పలానా వాళ్లకు మాత్రం ఓటేసి గెలిపించండి అంటూ ఏదో అధికారంతో ఆర్డర్ వేసినట్టు చెప్పి వెళ్ళాడు.

ఇప్పటికి పార్టీ ముందు, అనంతరం రెండు సార్లు ఎవరూ చెప్పినా తనదారి తనదే అన్నట్టే ప్రవర్తించాడు సేనాని. అంతటితో చాలా మందికి ఇది కూడా ప్రజారాజ్యం మాదిరి పనికొచ్చే తట్టు లేదనుకొని పక్కకెళ్ళిపోయారు. అదే జరిగింది. తాను చెప్పకపోయినా ఎదో ఒకరోజు అదే చేసి తీరుతాడు అది కూడా అందరు చూస్తారు. కేవలం తనవల్లనే అంతా అనుకుంటూ, తానే అన్ని చేయాలి అనుకుంటూ అహం తప్ప ఎవరైనా తనమంచి కోసమే చెప్పినా వినకపోతే ఎవరు మాత్రం ఏమి చేయగలరు. ప్రస్తుతం జనసేన సేన కూడా అదే పరిస్థితులలో ఉంది. అయినా అభిమానం కాబట్టి భరిస్తూ తమ వంతు తాము చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. తరువాత ఎన్నికలకు వెళ్లినా తాను ఆశించిన బ్రహ్మాండమైన ఫలితం రాలేదని సాబ్ కు మాములుగా కాలలేదు. నిజానికి రాజకీయాలు వదిలేయాలి, కానీ పక్కవారికి ఇంకా ఆయన అవసరం తీరలేదేమో ఇప్పుడే వద్దని కాస్త ఆగమని, రాజకీయాలలో ఓపిక అవసరం అని మళ్ళీ బ్రెయిన్ వాష్ చేసినట్టే ఉంది, అందుకే ఏదో వాలకార్ధానికి అప్పుడప్పుడు మైక్ ముందు ఏదో ఒకటి అనేసి వెళ్లిపోతుంటారు. అంటే ఆయన దృష్టిలో ఈ పార్టీ ఎప్పుడో ఎక్కడో విలీనం అయిపోయింది. పిచ్చి సేన కు ఇంకా తెలిసిరాలేదు అంతే.

మరింత సమాచారం తెలుసుకోండి: