సినిమా వాళ్ళు తమకు అభిమానుల నుండి లభిస్తున్న ఆదరణ ను గ్రహించి కొందరు దానిని వాడుకోవడానికి రాజకీయాలలో కి వస్తుంటారు. అయితే కొందరు ఈ ప్రయత్నంలో విజయం సాధిస్తారు, ఇంకొందరు మళ్ళీ వెనక్కి వెళ్లి సినిమాలు చేసుకుంటూ ఉండిపోతారు. ప్రజాక్షేత్రంలో కి వచ్చిన చాలా మంది లక్ష్యం అధికారమే. కొందరు మాత్రం ప్రజాసేవ చేయడానికే వస్తుంటారు. అయితే అప్పుడప్పుడు కొన్ని పార్టీలు కూడా హడావుడిగా ఏర్పాటు అవుతుంటాయి. అవి రాజకీయ నేతలు వారి వ్యూహం ప్రకారం ఓట్ల చీలిక కోసం  ఏర్పాటు చేయబడినవి తప్ప గెలిచి ప్రజలకు సేవ చేయడానికి కాదు. అందుకే పార్టీగా మారిన ప్రతి వారు గెలుపు అంచుల వరకు కూడా వెళ్ళలేదు.

ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీ ఆవిర్భయించింది. దీని అధినేత కూడా పార్టీ పెట్టగానే పోటీ చేసి సీఎం పదవిలో కూర్చోవాలి అనే సరదాతోనే ప్రజాక్షేత్రంలోకి వచ్చాడు. అయితే అప్పట్లో తీసుకున్న నిర్ణయాలతో తాను పోటీ చేయబోవడం లేదని(తప్పుకుని ప్రజల అదృష్టమో లేక ఆయన ఖర్మో) స్పష్టం చేశాడు. అది కొన్ని పార్టీలు తమ స్వార్థం కోసం చేసిన రాజకీయ ఎత్తుగడ అని తెలుసుకోలేకపోయాడు. అప్పటి నుండి మళ్ళీ మాట్లాడని ఆయన తదుపరి ఎన్నికలలో మళ్ళీ అదే ఉద్దేశ్యంతో ఈ సారి పోటీలోకి దిగాడు(ఇక్కడ ఆయా పార్టీల తో కూటమిగానే ఉన్నాడు). ఇవన్నీ గమనిస్తున్న ప్రజలు తమకు మేలుచేసే పార్టీనే గెలిపించుకున్నారు. అంటే పవన్ కళ్యాణ్ అంచనా వేసినట్టుగా ఏ ఒక్కటి జరగలేదు.

మీకోసమే వచ్చాను అని ఆవిర్భావం రోజు ఉద్ఘాటించిన సాబ్ ఈ ఓటమితో చతికిల బడ్డాడు. తనకు ఓటు వేయని అభిమానులను, గెలిచిన పార్టీ పార్టీపై వీలైనప్పుడల్లా తన ఆక్రోశాన్ని చూపిస్తూనే ఉన్నాడు. ఇది చుస్తే చాలు ఈయన తన అధికారం కోసం తప్ప ప్రజలకు సేవ చేయడానికి రాలేదని. అధికారం వెంటనే దొరికేస్తుందనే ఉద్దేశ్యంతో వచ్చాడు కనుకనే అపజయాన్ని తీసుకోలేకపోయారు.  దీనిని ప్రజలు గ్రహించారు కాబట్టి బ్రతికిపోయారు. లేదంటే కనీసం ప్రజాసేవ ఎలా చేయాలో కూడా తెలియని వారిని పొరపాటున గెలిపించి ఉంటె పరిస్థితి ఎలా ఉండేదో ఊహించడం కష్టం. అప్పుడు తన మద్దతుతోనే గెలిచిన పార్టీలే ఈయన వెనుక ఉండి రాజకీయాలు చేసేవారు. అంటే అధికారం సాబ్ ది, పెత్తనం వేరే వారిది.

మరింత సమాచారం తెలుసుకోండి: