తెలంగాణాలో షర్మిల వైఎస్ పార్టీ పెట్టిన తరువాత అనేక విమర్శలు వచ్చాయి. కేవలం తమ కుటుంబంలో విబేధాలు కారణంగానే ఆమె తెలంగాణాలో పార్టీ పెట్టినట్టు విమర్శించారు కొందరు. ఇక జగన్ తమ పార్టీలో షర్మిలను వాడుకున్నాడు తప్ప పదవి ఇవ్వలేదనే పార్టీ పెట్టినట్టు కూడా అనేకమంది చెప్పుకొచ్చారు. వీటన్నిటికీ ఆమె తాజాగా ఓ మీడియా కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో సమాదానాలు చెప్పారు. తాను ఎవరి ఒత్తిడితోనో ఈ పార్టీ పెట్టలేదని, కేవలం తెలంగాణాలో రాజకీయ శూన్యం ఏర్పడిందని తెలిసి అక్కడ మళ్ళీ వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన తేవాలనే ఉద్దేశ్యంతోనే పార్టీ పెట్టినట్టు ఆమె చెప్పారు.

ఇక విపక్షాలు చేస్తున్న విమర్శలపై ఆమె మాట్లాడుతూ, ఎవరికో తోక పార్టీగా ఉండటానికి నేనేమి గతిలేక రాలేదు, వైఎస్ భావజాలం నాలోనూ ఉంది, ఆయన కూడా తొలినాళ్లలో పోరాడే ప్రజాభిమానం పొందారు, నేను ప్రస్తుత అధికారపార్టీ దాష్టికాలపై పోరాడి ప్రజలకు మేలు చేసి తీరుతానని ఆమె అన్నారు.  ఇక జగన్ పార్టీలో పదవుల విషయానికి వస్తే ఆయన అందుబాటులో లేనప్పుడు పార్టీని ప్రజలను జాగర్తగా చూసుకోవాలని అన్నారు, అదే బాధ్యతగా భావించి పాదయాత్ర నుండి అన్ని పనులు చేశాను తప్ప పదవులు ఆశించి కాదని ఆమె అన్నారు. అయినా అక్కడ పార్టీలో  ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఆశావహులు ఉన్నారు, మళ్ళీ నాకు చోటు ఎక్కడ ఉంటుంది అన్నారు ఆమె.  

కుటుంబ వివాదాల గురించి మాట్లాడుతూ, ఎవరి కుటుంబంలో అయినా చిన్న చిన్న గొడవలు లేకుండా ఉండవు, అవే మాకు మాకు ఉన్నాయి. అవి పరిష్కారం చేసుకుంటాం. దానికి పార్టీ పెట్టడానికి సంబంధం ఏముందో విమర్శించే వల్లే చెప్పాలి అని షర్మిల అన్నారు.  ఆయా విమర్శలు చేసే వారికి కుటుంబాలు లెవా, వాళ్లకు కుటుంబాలలో ఉండే అభిప్రాయభేదాలు ఏమిటో తెలియవా అని ఆమె ప్రశ్నించారు. నేను వచ్చింది వైఎస్ మాదిరి తెలంగాణాలో పాలన అందించాలని మాత్రమే అది తప్ప మరో లక్ష్యం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన పాలన ఎలా ఉందొ తెలంగాణ వాసులకు తెలుసు కాబట్టి, నేను మళ్ళీ ఆ విషయాలు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయినా నా పార్టీ కూడా ఆయన భావజాలంతోనే ముందుకు పోనుంది కాబట్టి ఆయన పధకాలు అన్ని మళ్ళీ అమలులోకి తెస్తాము.

మరింత సమాచారం తెలుసుకోండి: