ప్రస్తుతం ఏపీ లో పాలిటిక్స్ ఎంత హాట్ హాట్ గా ఉన్నాయో మనకు తెలిసిందే . వైసీపీ సీనియ‌ర్ నేత , మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఇప్పుడు పార్టీలో ఒంటరయి పోయార‌న్న‌ది క్లీయ‌ర్ గా తెలుస్తోంది. ఒక‌ప్పుడు ఆయ‌న నెల్లూరు జిల్లా నుంచి రాజ‌కీయం చేసినా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగులేని హ‌వా చెలాయించే వారు. ఇంకా చెప్పాలంటే ఆనం ఫ్యామిలీకి రెండు తెలుగు రాష్ట్రాల‌లో ఎంత క్రేజ్ ఉండేదో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

ఒక‌ప్పుడు నెల్లూరు జిల్లాలో నెల్లూరు సిటీతో పాటు వెంక‌ట‌గిరి - ఆత్మ‌కూరు - నెల్లూరు రూర‌ల్ - రాపూరు ఇలా ఎక్క‌డ చూసినా ఆనం ఫ్యామిలీ హ‌వా ఉండేది. వీరికి ఓ కోట‌రి ఉండేది. క‌ట్ చేస్తే ఇప్పుడు ఆనంకు ఆయ‌న ఎమ్మెల్యే గా ఉన్న సొంత నియోజ‌క వ‌ర్గం వెంకటగిరి లోనే పార్టీపై పట్టు లేకుండా పోయింది. అయినా ఆయ‌న ఎంతో వేద‌న‌ భరిస్తూ వస్తున్నారు.

సీనియ‌ర్ నేత‌గా ఉన్నా ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి లేదు స‌రిక‌దా ? క‌నీసం ఓ ఎమ్మెల్యేగా కూడా పార్టీలో ఎవ్వ‌రూ విలువ ఇవ్వ‌డం లేదు. మంత్రి వ‌ర్గంలో త‌న‌కు మంత్రి ప‌ద‌వి రాక‌పోతే ఆయ‌న ఏదో ఒక నిర్ణ‌యం తీసుకోవాల‌ని అనుకుంటున్నారు. అయితే ఆయ‌న మ‌న‌సంతా ఇప్పుడు వెంక‌ట‌గిరిలో కాకుండా ఆత్మ‌కూరు పైనే ఉంద‌ని అంటున్నారు. టీడీపీలోకి వెళ‌దామ‌ని మ‌న‌సులో ఉన్నా కూడా గ‌త ఎన్నిక‌ల‌కు ముందు అక్క‌డ నుంచే రావ‌డం... మ‌ళ్లీ ఏ మొఖం పెట్టుకుని అక్క‌డ‌కు వెళ్లాలో తెలియ‌క డైలామాలో ఉన్నారు.

ఇక ఆయ‌న ఎమ్మెల్యేగా ఉన్న వెంకటగిరిలో అధికారులు సయితం తనకు సహకరించడం లేదని ఆయ‌న‌ అనేక సార్లు ఆరోపించారు. చివ‌ర‌కు నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించ‌డ‌మే మానుకుంటున్నారు. ఇంత రాజ‌కీయ అనుభ‌వం ఉండి ఏం చేయాలో తెలియ‌ని పరిస్థితుల్లో ఆనం ఇప్పుడు వైసీపీలో ఒంట‌రిగా మారిపోయార‌న్న కామెంట్లు అయితే వ‌స్తున్నాయి. కొంద‌రు ఆయ‌న ప‌రిస్థితి చూసి జాలి చూపిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: