విజయవాడలో వంగవీటి కుటుంబం అంటే ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వంగవీటి కుటుంబానికి అభిమానులు ఎక్కువగానే ఉన్నారు. కాని వంగవీటి వారసుడు రాధాకృష్ణ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుంది ఏంటీ అనేది ఇప్పటికి అయితే క్లారిటీ కనపడటం లేదు. అయితే ఇటీవల వంగవీటి రాధ గుడివాడ నియోజకవర్గంలో పోటీకి దిగే సూచన ఉందని మీడియా కథనాలు వచ్చాయి. దీనిపై ఆయన స్పందించలేదు గాని ఇప్పుడు మాత్రం హడావుడి ఎక్కువగా మొదలయింది.

అయితే నిన్న రాధ... గుడివాడ లో మంత్రి కొడాలి నానీ తో భేటీ అయ్యారు అనే ప్రచారం సోషల్ మాధ్యమాల్లో చూసాము. ఈ క్రమంలో వైసిపిలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై వంగవీటి రాధ తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసారు. నిన్నటి గుడివాడ పరిణామాలపై అనుచరులతో మాట్లాడిన వంగవీటి రాధ... తాను వైసిపిలో చేరుతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారు  అని ఆవేదన చెందారు. శుభకార్యాలను సైతం రాజకీయాలకు వాడుకునే నీచ సంస్కృతి గుడివాడకు పాకింది అని ఆయన విమర్శలు చేసారు.

శుభకార్యాల లో శత్రువు ఎదురు పడినా పలకరించడం భారతీయ సంప్రదాయం అన్నారు రాధ. సంస్కృతి, సంప్రదాయాల స్ధానంలో కుట్ర రాజకీయాలకు తెరలేపుతున్నారు అని మండిపడ్డారు. తాడేపల్లి డైరక్షన్ కు గుడివాడలో యాక్షన్ జరిగింది అని అన్నారు ఆయన. ఇంత నీచంగా ప్రవర్తిస్తారని అనుకోలేదు అని విమర్శలు చేసారు. పామర్రు నుంచి గుడివాడ కు ర్యాలీగా తరలి వెళ్ళేందుకు వంగవీటి అభిమానులు సమాయత్తమయ్యారు అని ర్యాలీలతో శుభకార్యాలకు హాజరు కావడం సభ్యత కాదని వంగవీటి అభిమానులను వారించాను అని అన్నారు ఆయన. మన రాజకీయాల కు శుభకార్యాలు వేధిక కాకూడదు అని అభిప్రాయపడ్డారు. శుభకార్యంలో ఉన్నప్పుడే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం గురించి తెలిసింది అని అన్నారు ఆయన. అలాగే సోషల్ మీడియాలో జరుగుతున్న సమాచారంపై ఆవేదన వ్యక్తం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap