మంత్రి హరీష్ రావు ఇప్పుడు సొంత జిల్లా సిద్దిపేటకు పరిమితం కావడం పట్ల ఆసక్తికర సంభాషణలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఆయన హైదరాబాద్ కు పెద్దగా రావడం లేదు. ఇప్పుడు అక్కడే ఉంటూ నియోజకవర్గంలో సొంత జిల్లాలో ఎక్కువగా కష్టపడుతున్నారు. తాజాగా గజ్వెల్ పట్టణంలో మంత్రి హరీష్ రావు పర్యటనకు వెళ్ళారు. గజ్వెల్ ఏరియా మెడికల్ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసారు. కొండ లక్ష్మన్ బాపూజీ 106 జయంతి సందర్భంగా బాపూజీ విగ్రహా అవిషకారణ చేసి పూలమాల వేసి నివాళులర్పించారు మంత్రి హరీష్ రావు.

ఆయనతో పాటుగా ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ, కొండ లక్ష్మన్ బాపూజీ జయంతి రోజు ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం నా అదృష్టంగా భావిస్తున్న అన్నారు. టీఆరెస్ పార్టీ 2001 లో తెలంగాణ కోసం  ఉద్యమం ప్రారంభించినప్పుడు టీఆరెస్ పార్టీకి  బాపూజీ  నీడ ఇచ్చారు అని ఆయన గుర్తు చేసుకున్నారు. బాపూజీ చివరి రోజుల్లో ఆయనను కలిసే అవకాశం నాకు దొరికింది అని హరీష్ గుర్తు చేసుకున్నారు. 2001 లో టీఆరెస్ పార్టీ ఆవిర్భావం బాపూజీ ఆశిస్సులతో జరిగింది అని హరీష్ ప్రస్తావించారు.

బాపూజీ తొలితరం తెలంగాణ  ఉద్యమ కారుడు అని మంత్రి హరీష్ రావు గుర్తు చేసుకున్నారు. 69 వ ఉద్యమం లో బాపూజీ క్రియాశీలకంగా పాల్గొన్నారు అని ఆయన తెలిపారు. పద్మశాలి కుల అభ్యున్నతి కోసం రాష్ట్ర ,దేశ వ్యాప్తంగా సహాయ శక్తుల కృషి చేసిన మహా నాయకుడు అని ఆయన కీర్తించారు. బాపూజీ గౌరవం కోసం గజ్వెల్ నియోజకవర్గం లో నిర్మించిన హార్టికల్చర్ యూనివర్సిటీ కి కేసీఆర్  ఆయన పెరు నామకరణం చేశారు అని హరీష్ అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా నాయకులు మండల నాయకులు కూడా హాజరు అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts