అమెరికా పర్యటనలో మోడీ బస చేసిన హోటల్ గురించి వార్తలు వస్తున్నాయి. అది చూసే కొద్దీ చూడబుద్ది అవుతూనే ఉంది. ఆద్యంతం అమెరికా సంస్కృతిని అలదుకున్న అద్భుతం అది. దానికి 204 ఏళ్ళ చరిత్ర ఉందట. అప్పటి నుండి ఎన్నో మార్పులకు గురైనప్పటికీ ఇప్పుడే కట్టినట్టు, తీర్చిదిద్దినట్టు ఎంత ఆకర్షణగా ఉందొ చెప్పడానికి బాషా కూడా సరిపోదు. 1816లో దానిని నిర్మించారు. మొత్తం 9 సూట్లు ఉన్నాయి దానిలో. వీటిలో ఐదింటిలో దేశాధినేతలు అమెరికా పర్యటనకు వచ్చినప్పుడు బస చేస్తూ ఉంటారు. అబ్రహం లింకన్, జార్జ్ వాషింగ్టన్ పేర్లమీద ఈ సూట్లు ఉన్నాయి. ఎవరైనా బస చేయాలంటే దాదాపు కొన్ని నెలల ముందు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

ముందుగా చెప్పినట్టుగా హోటల్ ఇంటీరియర్ అంతా అమెరికా సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా తీర్చిదిద్దారు. అమెరికా పర్యటనకు వెళ్లిన మోడీ కూడా ఈ హోటల్ లో మూడు రోజులపాటు బస చేశారు. కరోనా నేపథ్యంలో ప్రవాస భారతీయులను కలవడం కుదరకపోయినప్పటికీ మోడీ ఉన్న చోటుకు ప్రవాసభారతీయులు పెద్ద ఎత్తున వచ్చారు. ఈ హోటల్ చుట్టూ కట్టుదిట్టమైన రక్షణ వ్యవస్థ ఉంటుంది. ఏఐ సాంకేతికతను ఉపయోగించుకొని మరి ఇక్కడ నిరంతరం రక్షణ వ్యవస్థ నిఘా ఉంచుతుంది. మోడీ ఈ పర్యటనలో ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ తో సమావేశం అయ్యారు, ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ కట్టుదిట్టమైన రక్షణ ఏర్పాటు చేశారు.

మూడురోజుల పర్యటనలో మోడీ తొలిరోజున ఐదు సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు. వీరితో పలు అంశాల గురించి చర్చించారు. మోడీతో భేటీ అయిన వారిలో శంతను నారాయణ్, వివేక్ లాల్ తదితరులు ఉన్నారు. వీరు భారతీయ అమెరికన్లు కావడం విశేషం. మోడీ ఈ పర్యటనలో ఇక్కడ బస చేయడంతో దీనికి ప్రాచుర్యం లభించింది. దీనిపై ఎక్కువ నెటిజన్లు సెర్చ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. దేశంలో ఎన్నికలు ఉన్నప్పటికీ మోడీ ఈ పర్యటనకు ప్రాధాన్యతను ఇవ్వడంపై రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతుంది. అయితే దేశానికి వాణిజ్య పరంగా, వీసా తదితర అంశాలపై ప్రత్యక్షంగా చర్చించి ఆయా సమస్యలు పరిష్కారం చేయడానికి ఆయన ప్రాధాన్యతను ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: