ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌ర్సెస్ వైసీపీగా మాట‌ల యుద్దం న‌డుస్తోంది. అయితే, ఇది ఇప్పుడు మొద‌ల‌యింది కాదు. వ‌కీల్ సాబ్ సినిమా స‌మ‌యంలోనే ఈ గొడ‌వ అంత ప్రారంభ‌మ‌యింది. నిజానికి చెప్పాలంటే వైసీపీ వ‌ర్సెస్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అనే దానికంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌ర్సెస జ‌గ‌న్‌గా ఈ గొడ‌వ ఉంది. వాస్త‌వానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ తెర‌మీద‌కు తెచ్చిన స‌మ‌స్య‌ల‌ను ప‌వ‌న్ పేరు చెప్ప‌కుండానే వైసీపీ సెట్ చేసింది. అయితే, ఇప్పుడు సినిరంగ సంస్క‌ర‌ణ‌ల విష‌యంలో మాట‌ల యుద్దం ప‌తాక స్థాయికి చేరుకుంది.


  అయితే, ఈ విష‌యం మంత్రులు అంద‌రు ప‌వ‌న్ క‌ళ్యాణ్ రెచ్చ‌గొట్టేలా వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నార‌న్న‌ది ఒక సారి గ‌మ‌నిస్తే ప‌వ‌న్ ఆవేశంలో త‌ప్పు నిర్ణ‌యం తీసుకోవ‌డం కోసం మాత్ర‌మే అన్న‌ది రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. ప‌వ‌న్ ను రెచ్చ‌గొట్ట‌కుండా ఉంటే వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ అవుతుంది. దీని ద్వారా వైసీపీకి న‌ష్టం క‌లిగే అవ‌కాశం ఉంటుంది. ఇప్ప‌టి నుంచే జ‌న‌సేనను టీడీపీ వైపు నెట్టి టీడీపీ జ‌న‌సేన ఒక్క‌టేన‌ని చెప్పే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. దీని ద్వారా టీడీపీకి ఓటేసిన జ‌న‌సేన‌కు ఓటేసిన ఒక్క‌టేన‌ని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లేందుకు పీకే వ్యూహాలు అమ‌లు చేస్తున్నారు.



దీని వ‌ల్ల వైసీపీ లాభ‌ప‌డుతుందనేది జ‌గ‌న్ అనుచ‌రుల్లో వినిపిస్తున్న మాట‌లు.   అలాగే, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను రెచ్చ‌గొడితే  ఆవేశంలో కులాన్ని ముందుకు తీసుకు వ‌స్తాడు. దీని ద్వారా కాపులు, క‌మ్మ అనేది సామాజిక వ‌ర్గాన్ని ప‌వ‌న్ తెర‌మీద‌కు తీసుకువ‌స్తే.. దానికి స‌మాంత‌రంగా బీసీలు బ‌య‌ట‌కు వ‌స్తారు. దీని ద్వారా వైసీపీ బీసీల‌ను మ‌చ్చిక చేసుకోవాల‌ని చూస్తోంది. పోయిన సారి వైసీపీకి బీసీ సామాజిక వ‌ర్గం పెద్ద ఎత్తున ఓట్లు వేసి గెలిపించింది.


అదే రాజ‌కీయ స్ట్రాట‌జీని వైసీపీ మ‌ళ్లీ పున‌రావృతం చేయాల‌నుకుంటుంద‌ని రాజ‌కీయ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. గ‌తం నుంచే బీసీల‌కు 50 శాతం రిజ‌ర్వేష‌న్లు లాంటి అంశాల‌ను ప్ర‌స్తావిస్తు వ‌స్తోంది. కుల స‌మీక‌ర‌ణాలు తీసుకు రావ‌డం ద్వారా ప్ర‌త్య‌ర్థులు తేలిపోతార‌నేది వైసీపీ వ్యూహం ర‌చిస్తోంది. బీహార్‌, ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని రాజ‌కీయ వ్యూహాల‌ను అమ‌లు చేయ‌డానికే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను వైసీపీ రెచ్చ‌గొడుతుంద‌నేది రాజ‌కీయ విశ్లేష‌కుల అభిప్రాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: