మాజీ ముఖ్య‌మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోద‌రుడు, చిత్తూరు జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నేత kishore kumar REDDY' target='_blank' title='నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఇటీవ‌లే కాస్త యాక్టివ్ అయ్యారు. ఇప్ప‌టికే పీలేరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస‌గా రెండు సార్లు పోటీ చేస్తోన్న ఆయ‌న రెండు ఎన్నిక‌ల లోనూ ఓడిపోతూ న్నారు. 2014 ఎన్నిక‌ల‌లో కిషోర్ కుమార్ రెడ్డి త‌న అన్న పెట్టిన జై స‌మైక్యాంధ్ర పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నిక‌ల‌లో రెండు తెలుగు రాష్ట్రాల‌లో ఆ పార్టీ నుంచి పోటీ చేసిన నేత‌ల లో ఆయ‌న‌కు మాత్ర‌మే డిపాజిట్లు ద‌క్కాయి.

ఇక గ‌త ఎన్నిక‌ల‌కు ముందు త‌న కుమారుడితో క‌లిసి టీడీపీ లో జాయిన్ అయిన ఆయ‌న టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నిక‌లు ముగిసి రెండేళ్లు అయిపోయాయి. ఈ రెండేళ్ల‌లో ఆయ‌న పెద్ద యాక్టివ్ గా లేరు. అయితే ఇప్పుడిప్పుడే ఆయ‌న యాక్టివ్ అవుతోన్న ప‌రిస్థితి ఉంది. అయితే ఆయన తన పీలేరు నియోజకవర్గానికే పరిమితం కావాలని నిర్ణయించుకున్నారు. చంద్ర‌బాబు మాత్రం మంత్రి పెద్దిరెడ్డిని టార్గెట్ చేసే క్ర‌మంలో పుంగ‌నూరు నియోజ‌క‌వ‌ర్గంపై కూడా కాన్ సంట్రేష‌న్ చేయాల‌ని చూస్తున్నారు.

చంద్ర‌బాబు చేసిన ఈ ప్ర‌తిపాద‌న‌ను కిషోర్ కుమార్ తిర‌స్క‌రించిన‌ట్టు తెలుస్తోంది. ఇక‌పై తాను పీలేరు నియోజ‌క‌వ‌ర్గంలోనే ఉంటాన‌ని అక్క‌డ పార్టీ కేడ‌ర్ లో ఆయ‌న భ‌రోసా నింపుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల‌లో గెలుపు ల‌క్ష్యంగా అంద‌రం ప‌ని చేయాల‌ని ఆయ‌న మండ‌ల స్థాయి నేత‌ల‌కు ధైర్యం నూరి పోస్తున్నారు. ఇప్ప‌టికే అక్క‌డ రెండు సార్లు గెలిచిన చింత‌ల రామ చంద్రారెడ్డిపై ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త ఉంది. ఈ క్ర‌మంలోనే దీనిని క్యాష్ చేసుకుని వ‌చ్చే ఎన్నిక‌ల‌లో ఎలాగైనా గెల‌వాల‌ని కిషోర్ కుమార్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

ఈ సారి ఎలాగైనా అసెంబ్లీ లో అడుగు పెట్టాల‌ని భావిస్తోన్న ఆయ‌న తాను పీలేరులోనే ఉంటాన‌ని.. పుంగ‌నూరు బాధ్య‌త త‌న‌పై పెట్ట‌వ‌ద్ద‌ని చెప్పిన‌ట్టు టాక్ ?

 

మరింత సమాచారం తెలుసుకోండి: