గులాబ్ తుఫాన్ ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందిస్తూ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గులాబ్ తుఫాను ప్రభావంతో ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాలో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వేలాది మంది నిరాశ్రయులు అయ్యారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తుండంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తుఫాను ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు తెలుగుదేశం పార్టీ నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు తమ వంతు సాయం అందజేయాలి అని ఆయన వెల్లడించారు.

ప్రజలకు అవసరమైన నిత్యావసర సరకులతో పాటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించడంలో సహాయం అందించాలి అని ఆయన విజ్ఞప్తి చేసారు. బాధితులకు టీడీపీ శ్రేణులు అన్ని విధాల అండగా నిలవాలి అని చంద్రబాబు నాయుడు కోరారు. గులాబ్ తుఫాను ప్రభావంపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అని అన్నారు ఆయన. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నంలో లోతట్టు ప్రాంతాల ప్రజలకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి అని విజ్ఞప్తి చేసారు.

విద్యుత్ సరఫరాకు ఆటంకం కలుగకుండా అప్రమత్తంగా ఉండాలి అని చంద్రబాబు నాయుడు కోరారు. ముందస్తు చర్యలు చేపట్టి నష్టాన్ని నివారించాలి అని అన్నారు. కృష్ణా జిల్లాలో భారీగా వర్షాలు పడుతున్నాయి. ఇళ్లలోకి  భారీగా వరద చేరడంతో చాలా ప్రాంతాల్లో ప్రజలు చుక్కలు చూస్తున్నారు. వరద నీటితో ఇంట్లో ఇబ్బంది పడుతున్న గురించి సమాచారం తెలుసుకున్న గ్రామ   యువకులు మంచం పై మోసుకొని వెళ్లి వరద లేని ప్రదేశం లోకి  తరలించారు. తిరువూరు మండలంలోని చింతలపాడు వద్ద గుర్రపువాగుపై భారీగా వరద ప్రవాహం పోటెత్తడంతో రెండు మండలాలకు రహదారి సదుపాయం కట్ అయింది. వాగుల్లో ప్రమాదకరమైన విషసర్పాలు కొట్టుకు రావడంతో పాద చారులు, వాహన దారులు భయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: