జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు కీలక కామెంట్స్ చేసారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అధికార పార్టీ నేతలు విమర్శలు చేయడంతో స్పందించిన ఆయన... సినిమా ఇండస్ట్రీ పై జరుగుతున్న దాడిని పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తే వైసీపీ నేతలు అనేక విమర్శలు చేస్తున్నారు అని ఆయన ఆరోపణలు చేసారు. వైసీపీ నేతలు రాచరిక పాలన చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేసారు. వైసీపీ లో ఇంతమంది సన్నాసులు ఉన్నారని నిన్నే తెలిసింది అని ఆయన ఎద్దేవా చేసారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఒక సన్నాసి అంటూ విమర్శలు చేసారు.

దుర్గమ్మ దేవస్థానంలో వెండి సింహన్నీ దొంగిలించిన దొంగ వెల్లంపల్లి అని మండిపడ్డారు ఆయన. వెల్లంపల్లి శ్రీనివాస్ ని దుర్గమ్మ గుడి చుట్టూ తిప్పి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అని ఆయన హెచ్చరించారు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడడాలి అని ఆయన హితవు పలికారు. ఇరిగేషన్ శాఖ ఎలా ఉందో ఏమి జరుగుతుందో తెలియదు  అని అన్నారు. దొరికిన కాడికి అమ్ముకోవడం తప్ప అనిల్ చేస్తుంది ఏంటి అని ఆయన ప్రశ్నించారు. ఏపీలో ఎప్పుడు లేని స్థాయిలో డ్రగ్స్ రాకెట్ బయటకు వస్తే ఇంతవరకు స్పదించలేదు అని మండిపడ్డారు.

సంవత్సరం నుంచి ఏమంత్రి ఎక్కడ ఉన్నారో ప్రజలు ఎవరికి తెలియదు అని ఆయన ఎద్దేవా చేసారు. ముఖ్యమంత్రి బయటకు వచ్చిన దాఖాలలు ఎక్కడ లేవు అని అన్నారు. సలహాదారుడు చేతిలో రాష్టం పెట్టి మంత్రులు ఎమ్మెల్యేలు ఇంట్లో కూర్చుని భజన చేస్తున్నారు అని ఆరోపణలు చేసారు ఆయన. మంత్రి పేర్నినాని దిగజారి మాట్లాడుతున్నాడు అని మండిపడ్డారు. కులాలు గురుంచి మాట్లాడి హక్కు పేర్నినాని కి ఎవరు ఇచ్చారు అని ప్రశ్నలు వేసారు. దమ్ము ధైర్యం ఉంటే వైసీపీ నేతలు బహిరంగ చర్చ కి రావాలి అని సవాల్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap