నా పార్లమెంటు నియోజవర్గ పరిది లో  షర్మిళ 4 చోట్ల ప్రచారం చేశారు జనం బాగా వచ్చారు అని ఆమెకు సంబందం లేదు అని సజ్జల అనడం దురదృష్టకరం అన్నారు వైసీపీ నర్సాపురం పార్లమెంట్ సభ్యులు రఘురామ కృష్ణం రాజు.  సజ్జల గారు కేవలం మౌత్ పీస్ అంటూ ఎద్దేవా చేసారు. జగన్ గారు చెప్పమన్నందుకే సజ్జల గారు అలా చెప్పారు అని అన్నారు. ముఖ్యమంత్రి గారు చెప్పిందే సజ్జల గారు మాట్లాడుతుంటారు అని పార్టీ కోసం ,ఎన్నికల కోసం  జగన్  కంటే ఎక్కువ కష్ట పడింది షర్మిల గారు అని రఘురామ వ్యాఖ్యలు చేసారు.

పార్టీ లో సభత్యం లేదు అని షర్మిల అనడం షాకింగ్ న్యూస్ అన్నారు రఘురామ. ఆమెకు అన్యాయం జరిగింది అని పేర్కొన్నారు. సొంత చెల్లెమ్మలను కుడా పట్టించుకోకుండా మిగిలిన ఆడపడుచుల కోసం జగన్ కష్ట పడుతున్నారు అని ఆయన వ్యాఖ్యలు చేసారు. జగన్ షర్మిల మధ్య ఖచ్చితంగా విభేదాలు ఉన్నాయి అని అన్నారు రఘురామ. ఆస్తులు లాగానే రాజకీయాలను పంచుకున్నట్టు కనపడుతోంది అన్ని ఆయన వ్యాఖ్యలు చేసారు. అన్నా చెల్లెలు మాట్లాడుకోవడం తప్పుకాదు అని ఆయన పేర్కొన్నారు.

జగన్ కడిగిన ముఖ్యం లాగా బయటకురావాలి అనేది తన కోరిక అన్నారు. జగన్ జైలు కు  ఏందుకు వెళతాడు కడిగిన ముత్యంలా బయటకు వస్తాడు అని షర్మిళ చెప్పలేదు అంటూ ఆయన నిలదీశారు. చాలా వరకు నిజాలు చెప్పారు షర్మిల అని అన్నారు. విభేదాలు కు ఆస్తులు ఒక కారణం కావచ్చు అని ఆయన పేర్కొన్నారు. ప్రజల్లో మా పార్టీ గ్రాఫ్ తగ్గుతోంది వాపు చూసి బలం అనుకోవద్దు అని ఆయన హెచ్చరించారు. 15 శాతం తగ్గింది ప్రజల్లో వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ అని ఆయన వెల్లడించారు. పవన్ కళ్యాణ్ చెప్పినదానిను నేను పూర్తిగా సమర్ధిస్తా అన్నారు ఆయన. పవన్ కళ్యాణ్ పై మంత్రుల వ్యాఖ్యలు చాలా దారుణం అని ఆవేదన వ్యక్తం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap