జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రులు చేసిన విమర్శలకు జనసేన నేతలు గట్టిగా సమాధానం ఇచ్చేసారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన జనసేన నాయకులు పవన్ కల్యాణ్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అని కోరారు. రౌడీల్లా స్పందించటం తగదు అని అన్నారు ఆయన. సన్నాసి ఎవరో పవన్ పేరు చెప్పలేదు అని... సన్నాసి నేను అని పేర్నినాని ముందుకు వచ్చాడు అంటూ జనసేన నేత పసుపులేటి హరిప్రసాద్ పేర్కొన్నారు. మంత్రి పదవి పోయే ముందు పవన్ ను తిడితే మంత్రి పదవి నిలుపుకోవచ్చు అనుకుంటున్నట్టున్నారు అని ఆయన ఎద్దేవా చేసారు.

సంకర జాతి వాడు పేర్నినాని అని ఆయన అన్నారు. మంత్రిగా ఉండి కులం గురించి మాట్లాడి, మంత్రిస్థాయిని దిగజార్చారు అని ఆరోపణలు చేసారు. కులానికి మతాలకు అతీతంగా రాజకీయాలు ఉండాలని పార్టీ పెట్టిన వారు పవన్ కల్యాణ్  అని ఆయన విమర్శలు చేసారు. మీడియా స్వేచ్ఛను కూడా హరించిన పార్టీ వైసీపీ అని విమర్శలు ఎక్కు పెట్టారు. కరోనా పెట్టిన  కష్టాలకంటే వైసీపీ పార్టీ ఎక్కువ కష్టాలు పెడుతోంది అని అన్నారు. ఓటుకు అయిదువేలు పెట్టి గెలుస్తామని అనుకుంటున్నారు అని ఆయన విమర్శలు చేసారు.

రాబోయే రోజుల్లో  వైసీపీకి పతనం తప్పదు అని జనసేన నేత పసుపులేటి హరిప్రసాద్ జోస్యం చెప్పారు. చెత్తపైన పన్ను, మద్యం ధరలు పెంచటం, పన్నులు పెంచటం, విద్యుత్ చార్జీలు పెంచటం వంటివి నిత్యం సామాన్యుడిపై పడేభారం అన్నారు మరో నేత కిరణ్ రాయల్. ఎప్పుడో ఒక రోజు వచ్చే సినిమా టిక్కెట్ల ధరలను పెంచకూడదని అంటున్నారు అని  అప్పుడు  పెంచిన ధరలు, పన్నులు తగ్గించండి అని విజ్ఞప్తి చేసారు. అనిల్‌ కుమార్ యాదవ్ వ్యభిచార శాఖ మంత్రి అని మాదాపుర్ లో హేవన్ అనే స్పా ఉంది అని దాని నుంచి వ్యభిచారం చేయిస్తున్నాడు  అంటూ దూరం రేపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: