ఈటల రాజేందర్ పై మంత్రి హరీష్ రావు మరోసారి నిప్పులు చెరిగారు.  హుజూరాబాద్ నియోజక వర్గం లో ఒక్క మహిళ భవనం ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు  కట్టలేదని.. ధరలు పెంచిన బిజెపి కి  ఓటు వేయాలని అడుగుతున్నారని ఫైర్ అయ్యారు.  హుజూరాబాద్ కు వచ్చి అభివృద్ది పనులతో పాటు కమ్యూనిటీ హల్ లు ఇచ్చానని... హుజూరాబాద్ లో పార్టీ కార్యకర్త గా రాష్ట్ర మంత్రి గా పని చేస్తున్నానని స్పష్టం చేశారు. ఈటల రాజేందర్ ప్రలోభాలకు గురి చేస్తే తప్పు లేదు కానీ నేను హుజూరాబాద్ లో అభివృద్ది చేస్తే తప్ప.. కేంద్ర ప్రభుత్వం నుండి రెండు వేల కోట్లు తీసుకొస్తా పెంచిన ధర తగ్గిస్త అని చెప్పాలని మండిపడ్డారు. టీఆరెఎస్ పార్టీ ఎం చేసిందో చెప్పింది బిజెపి ఎం చేస్తుందో చెప్పాలని నిలదీశారు హరీష్ రావు.

వచ్చే మార్చి బడ్జెట్ లో మిగితా రైతు రుణాల మాఫీ చేస్తామని.. రెండున్నర సంవత్సరాల కోసం గెల్లు శ్రీనివాస్ ను గెలిపించాలని... ఉద్యమకారుడు బీద కుటుంబం నుండి వచ్చిన గెళ్లు శ్రీనివాస్ కు ఓటు వేయాలని కోరారు హరీష్ రావు. ఈ రోజు మీటింగ్ కు గేల్లు శ్రీAనివాస్ కు ఒక్క రూపాయి ఖర్చు కాలేదు కారీకార్థలే ఖర్చు పెట్టికున్నారని.. రాష్ట్రం లో యాభై ఎడు ఏళ్లు నిండిన వారికి రాబోయే రెండు నెలల్లో పెన్షన్ లు ఇస్తామని హామీ ఇచ్చారు హరీష్ రావు.
కరోనా వాళ్ళ ఆర్థిక ఇబ్బందులతో కొంత ఆలస్యం అయిన మాట వాస్తవమని.. రైతు లకు ఉచిత విద్యుత్ కోసం సిఎం ముఖ్యమంత్రి ఖర్చు పెట్టారని వెల్లడించారు హరీష్ రావు.

రైతు బంధు,రైతు భీమ , ఉచిత విద్యుత్ మీద రాష్ట్ర ప్రభుత్వం లక్ష కోట్లు ఖర్చు చేసిందని.. రైతు ల వద్ద ఒక్క రూపాయి కూడా వడ్డీ తీసుకోవద్దు రైతు రుణాల వడ్డీ నీ ప్రభుత్వమే కడుతుందాని బ్యాంకులకు ఆదేశాలు ఇచ్చామన్నారు హరీష్ రావు. పనిచేసే టీఆరెఎస్ ప్రభుత్వాన్ని గెలిపించుకునీ పనులు చేసుకోవాలని.. బిజెపి కి ఓటు వేస్తే ఢిల్లీ కి పోవాల్సి వస్తుందన్నారు హరీష్ రావు.

మరింత సమాచారం తెలుసుకోండి: