ఏపీలో జనసేన వర్సెస్ అధికార పార్టీగా రాజకీయం మారుతుంది. జనసేన నాయకులపై చేస్తున్న విమర్శలకు అలాగే తమ అధినేత పవన్ కళ్యాణ్ పై చేస్తున్న విమర్శలకు వాళ్ళు గట్టిగానే సమాధానం ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ బహిరంగ సభ తర్వాత రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్న అధికార పార్టీ నేతలు జనసేన విషయానికి వచ్చేసరికి దూకుడుగా కామెంట్స్ చేస్తున్నారు. రాజకీయంగా పార్టీ ని బలోపేతం చేసే ఆలోచనలో ఉన్న ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీ మంత్రులను లక్ష్యంగా చేసుకున్నారు.

నిన్న ముగ్గురు మంత్రుల విమర్శల తర్వాత  నేడు జనసేన నేతలు స్పీడ్ పెంచి ఘాటు విమర్శలు చేసారు. మంత్రి పేర్ని నానీ పవన్ లక్ష్యంగా చేసిన విమర్శలు ఒక రేంజ్ లో హైలెట్ అయ్యాయి. ఇక ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ తీవ్ర విమర్శలు  చేయడం సైలెంట్ అయింది.  సినిమా పరిశ్రమ ఏమి పవన్ కళ్యాణ్ సొంత సొత్తు కాదు అని స్పష్టం చేసారు.  చిరంజీవికి ఉన్న హూందాతనం పవన్ కళ్యాణ్ కు లేదు అని అన్నారు ఆయన. సినిమా పోర్టల్ అన్ లైన్ వ్యవస్థ కు చిరంజీవి  పూర్తి మద్దతు ఇస్తానన్నారు అని ఆయన పేర్కొన్నారు.

యుద్ధానికి సిద్ధం అంటూ కార్యకర్తలను రెచ్చగొడుతూ, తాలిబన్ పంథా పరిపాలనను జనసేన కోరుతున్నట్లు కనిపిస్తుంది అని ఆయన వ్యాఖ్యలు చేసారు. సినిమా పరిశ్రమలో అవినీతిని అరికట్టేందుకు కొత్త ఆన్ లైన్ వ్యవస్థ అని ఆయన స్పష్టం చేసారు. జీఎస్టీ విధానంపై  ప్రధానిని ప్రశ్నించి తర్వాత మా ప్రభుత్వ పనితీరును ప్రశ్నించండి అని హితవు పలికారు.  స్థానికసంస్థల్లో టీడీపీ జనసేనది అక్రమపొత్తు అని మండిపడ్డారు.   జనసేన ఒక్క కాపులకే పరిమితమా అని ప్రశ్నించారు. కాపు అంటే నమ్మకానికి ప్రతిరూపం. కాపులకు మచ్చ తెచ్చే పార్టీ మీది అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: