ఒక ప్రముఖ ఛానల్ కు తెలంగాణా వైఎస్సార్ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. సోదరి షర్మిల కు తండ్రి లేడు అని అన్న ఆదరణ కరువైంది అంటూ ఆడ కూతురు ఆవేదనలో ఏదో మాట్లాడుతుంది అని ఆయన వెటకారంగా స్పందించారు. రాజకీయ పార్టీలు మాట్లాడితే నేను స్పందిస్తా అన్నారు ఆయన. ఎన్జీవో నడుపుకునే వారు మాట్లాడితే స్పందించవలసిన అవసరం లేదు అంటూ తీసిపారేశారు. ఈ ప్రాంతం తో ఆమెకు సంబంధం లేదు అని అన్నారు రేవంత్.

అదే విధంగా ఇక్కడి పరిస్థితి ఆమెకు తెలియదని అన్నారు రేవంత్. వైఎస్ ఆస్తులకు వారసులు జగన్, షర్మిలే అనుమానం లేదు అని అన్నారు ఆయన. కులపెద్దలో.. మతపెద్దలనో కూర్చో పెట్టుకుని ఆస్తుల పంచాయితీ తీర్చుకోవాలి అని ఆయన సూచించారు. వైఎస్ ఆస్తులు మాకొద్దు మేము వారసులం కాదు అని పేర్కొన్నారు. రాజకీయంగా మాత్రం వైఎస్ కాంగ్రెస్ నాయకుడు అని ఆయన పేర్కొన్నారు. రాహుల్ ప్రధాని కావాలని వైఎస్ కోరుకున్నారు అని ఆయన వెల్లడించారు. మోడీ ప్రధానిగా ఉండాలో రాహుల్ కావాలో చెప్పాలి అని ఆయన డిమాండ్ చేసారు.

రైతుల కోసం 10నెలలుగా పోరాటం జరుగుతోంది అని అన్నారు ఆయన. నల్ల చట్టాలు రద్దు చేయాలని 400మంది రైతులు బలయ్యారు అని ఆయన వెల్లడించారు. ఆదాని అంబానిల కోసం రైతుల హక్కులను కాలరాయడానికి మోడీ సిద్ధమయ్యారు అని ఆయన తెలిపారు. పెట్టుబడి దారుల చేతుల్లో దేశాన్ని బంధించడానికి బీజేపీ సిద్ధమైంది అని ఆరోపణలు గుప్పించారు.  మోడీ, అమిత్ షా దేశాన్ని అమ్మడానికి, ఆదాని, అంబానీ కొనడానికి గుజరాత్ నుంచి బయలుదేరారు అని అన్నారు. భారత్ బంద్ కు ఆనాడు కేసీఆర్ మద్దతు ఇచ్చారు, కేటీఆర్ రాస్తారోకోలో పాల్గొన్నారు అని పేర్కొన్నారు. వారం తిరక్కముందే ఢిల్లీకి వెళ్లి మోడీని కలిసిన కేసీఆర్ కు చలిజ్వరం పట్టుకుంది అని ఆయన ఎద్దేవా చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts