బంగాళా ఖాతం లో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో   కురుస్తున్న  భారీ వర్షాలకు నగరం లో గల  లోతట్టు ప్రాంత  ప్రజలను సురక్షిత ప్రాంతాలకు  తరలించాలని  అధికారులకు ఆదేశాలు జారీ చేసారు హైదరాబాద్ మేయర్ గద్వాల విజయ లక్ష్మి. క్షేత్ర స్థాయిలో పనిచేసే అధికారులు అప్రమత్తంగా ఉండాలని.,,   24  గంటల పాటు అందరూ అధికారులు అందు బాటు లో ఉండాలని కీలక ఆదేశాలు జారీ చేశారు మేయర్ గద్వాల విజయ లక్ష్మి. భారీ వర్షాల నేపథ్యం లో  ఎలాంటి ఆస్తి ప్రాణ  నష్టం  జరగ వద్దని పేర్కొన్నారు మేయర్ గద్వాల విజయ లక్ష్మి. 

 ప్రజల వరదల వలన ఇబ్బందులు ఎదురైతే ప్రధాన కార్యాలయం లో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్  040-21111111 కు కాల్ చేయాలని కోరారు మేయర్ గద్వాల విజయ లక్ష్మి.  భారీ వరదల నేపథ్యం లో  ఈ కాల్ సెంటర్ 24 గంటల పాటు పని చేస్తుందన్నారని స్పష్టం చేశారు మేయర్ గద్వాల విజయ లక్ష్మి.    వరదల కు గురయ్యే లోతట్టు ప్రజలను ముందుగా గుర్తించి  వారి కుటుంబాలకు  వెంటనే  పునరావాస కేంద్రాలకు తరలించాలని.. అలాగే నిర్వశితులకు  కావాల్సిన బోజనం మరియు  త్రాగు నీరు  వసతి కల్పించాలని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు మేయర్ గద్వాల విజయ లక్ష్మి.  

 ఈ విషయం లో ఎలాంటి లోటు పాట్లు ఉండ కుండ చర్యలు చేపట్టాలని  జోనల్ కమిషనర్ల కు ఆదేశాలు జారీ చేశారు మేయర్ గద్వాల విజయ లక్ష్మి.  వర్షా ప్రభావిత ప్రాంతాల అధికారుల తో  మేయర్ ఎప్పటి కప్పుడు సమీక్షిస్తూ తగు చర్యలు కై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మేయర్ గద్వాల విజయ లక్ష్మి. కాగా హైదరాబాదు మహానగరంలో ఇవాళ ఉదయం నుంచి... వర్షం కురుస్తూనే ఉంది. హైదరాబాద్ మహానగరం వ్యాప్తంగా ఈ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలు ఆఫీసులకు మరియు ఇతర అవసరాలకు బయటికి వెళ్లేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా జోరుగా వర్షాలు పడుతున్నాయి. మరో ఐదు నుంచి ఆరు గంటల వరకు ఈ భారీ వర్షాలు హైదరాబాద్ మహానగరంలో కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మహానగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది వాతావరణ శాఖ.

మరింత సమాచారం తెలుసుకోండి: