రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు నేడు మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలో రెవెన్యూ ఉద్యోగులు తీవ్రమైన పని ఒత్తిడి, ఆర్థిక ఒత్తిడి మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు అని అన్నారు ఆయన. పని చేయండని సమీక్షలు చేయడం మినహా ఉద్యోగులకు రావలసిన కనీస మౌలిక సదుపాయాలు నిధులు, తగినంత సిబ్బందిని నియమించడంపై ఉన్నతాధికారులు సమీక్షించడం లేదు అని విమర్శలు చేసారు. ఎంత పని చేసినా రెవెన్యూ ఉద్యోగులను ప్రోత్సహించే అధికారులు లేరు అని ఆయన వ్యాఖ్యానించారు.

కొంతమంది జిల్లా కలెక్టర్లు ప్రభుత్వ మెప్పు కోసం రెవెన్యూ ఉద్యోగులను సస్పెండ్ చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేసారు. కనీస విచారణ చేయకుండా కొంత మంది కలెక్టర్లు రెవెన్యూ ఉద్యోగులను వేధిస్తూ సస్పెండ్ చేస్తూ ప్రభుత్వానికి నష్టం చేస్తున్నారు అని ఆయన విమర్శించారు. విచారణ పేరుతో రోజుల తరబడి పక్కన కూర్చో పెడుతున్నారు అని అన్నారు. ఈ విధంగా సస్పెండ్ చేస్తూ పోతే  రాష్ట్రంలో ఒక్క ఉద్యోగి అయిన మిగులుతాడా అని నిలదీశారు. ఫిర్యాదు చేస్తే చాలు తహసిల్దార్ పై 420 కేసు పెడుతున్నారు అని ఆయన ప్రశ్నించారు.

డీజీపీ ఇచ్చిన ఆదేశాలు ఎస్ఐలకు తెలియదా అంటూ ప్రభుత్వ ఉద్యోగులపై కేసులు పెట్టడం ఏంటి..? అని నిలదీశారు. ముందు రెవెన్యూ కార్యాలయాల్లో సరిపడా సిబ్బందిని నియమించండి అని ఆయన కోరారు. ఉద్యోగుల కు పని భారం ఎక్కువ అయింది డెడ్లైన్లు ఇస్తున్నారు కానీ సర్వర్లు సరిగా పని చేయవు అని అన్నారు. కావాలని ఏ ప్రభుత్వ ఉద్యోగి తప్పు చేయరు.. పని భారం ఎక్కువ ఉండటంతోనే తప్పులు చేస్తున్నారు అని విమర్శించారు. కార్యాలయాల్లో కనీస సౌకర్యాలు కూడా లేవు.. ముందు వాటిని కల్పించండి అని విజ్ఞప్తి చేసారు. ప్రభుత్వ ఆఫీసుల్లో 20 ఏళ్ల కిందటి కంప్యూటర్లలే ఉన్నాయి.. వాటినయిన మార్చండి అని ఆయన కోరారు. పోటీపడి కలెక్టర్లు ఉద్యోగులను సస్పెన్షన్ చేస్తున్నారు దయ చేసి ఆపండి  అని విజ్ఞప్తి చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap