ఢిల్లీ :  కేంద్ర ఆహార సరఫరా శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో  తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ కాసేపటి క్రితమే ముగిసింది.  ఏకంగా ఈ సమావేశం 40 నిమిషాల పాటు సాగడం గమనార్హం.  అయితే కేంద్ర ఆహార సరఫరా శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో  తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ పై తెలంగాణ ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్  వినోద్ కుమార్ క్లారిటీ ఇచ్చారు.   తెలంగాణ లో ధాన్యం కొనుగోలు అంశం పై ఈ సమావేశం చర్చ జరిగినట్లు చెప్పారు   వినోద్ కుమార్.  

తెలంగాణలో వరి ధాన్యం ఉత్పత్తి ఐదు రెట్లు పెరిగిందని.. కేంద్ర ప్రభుత్వం వద్ద వచ్చే ఐదేళ్ల వరకు గోడౌన్లు ఖాళీ లేవని చెప్పమని వెల్లడించారు   వినోద్ కుమార్.  కొన్ని పంటను నిల్వ చేసే పరిస్థితి లేదని.. విదేశాలకు ఎగుమతి చేసే అంశాన్ని కూడా పరిశీలించాలని సీఎం కెసిఆర్ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను కోరారని స్పష్టం చేశారు   వినోద్ కుమార్.  దేశ మంతటా పంట మార్పిడి చేపట్టాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్.. తెలంగాణ సర్కార్ కు   సూ చించారని వెల్లడించారు   వినోద్ కుమార్.

పంజాబ్ లో  సైతం పంట మార్పిడి చేస్తున్నారని పీయూష్ గోయల్ గుర్తు చేశారని తెలిపారు   వినోద్ కుమార్.   ఈ సమస్య పై  మరో రెండు రోజుల సమావేశా ల్లో సమస్య పరిష్కారం దొరుకుతుందని భావించామని చెప్పు కొచ్చారు   వినోద్ కుమార్.  ఇప్పటి కైతే  ఈ సమస్య పరిష్కారం పై ఇంకా స్పష్టత రాలేదని చెప్పారు   వినోద్ కుమార్.   మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తామని పీయూష్ గోయల్ చెప్పారని సపస్తం చేశారు   వినోద్ కుమార్.   మరో మూడు రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తేల్చి చెప్పారు   వినోద్ కుమార్.


మరింత సమాచారం తెలుసుకోండి: