ఏపీలో రాజకీయ వేడి గట్టిగానే రాజుకుంటోంది. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. నిజానికి ఈ టైమ్ లో ప్రతిపక్షాలు ఎక్కడా మాట్లాడని సీన్ గతంలో ఉండేది. కానీ ఏపీలో మాత్రం తొందర పడి కోయిలలు ముందే కూస్తున్నాయి.


ఇక ఏపీలో 2024లో ఎన్నికలు జరుగుతాయని టాక్. అయితే జగన్ ఈ మధ్య మంత్రివర్గ సమావేశంలో మంత్రులకు చేసిన సూచనలతో ముందస్తు ఎన్నికలు వస్తాయన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అది జరిగితే విపక్షాలు కదం తొక్కాల్సిందే. అందుకే ఇప్పటి నుంచే ఏపీలో పొలిటికల్ హీట్ గట్టిగానే ఉంది. నిన్నటిదాకా సినిమాలు తప్ప మరేమీ ఆలోచించని పవన్ కళ్యాణ్ ఇపుడు ఒక్కసారిగా జూలు విదిల్చారు. ఆయన ఈ మధ్య ఒక సినిమా ఫంక్షన్ లో చేసిన కామెంట్స్ ఆలోచించి చేసినవే అంటున్నారు. ఇక పవన్ తొందరలో జనంలోకి వస్తున్నారు.


ఇక మీదట తాను జనంలోనే ఉంటాను అని కూడా చెబుతున్నారు. అదే విధంగా పొత్తుల విషయంలో కూడా జనసేన ఒక ఆలోచనలో ఉందని అంటున్నారు. పవన్ కళ్యాణ్ తో మళ్ళీ పొత్తు పెట్టుకోవడానికి టీడీపీ కూడా ఉత్సాహపడుతోంది. ఈ రెండు పార్టీలు కలిస్తే వైసీపీకి ఇబ్బంది తప్పదు అంటున్నారు. దాంతోనే పవన్ హుషార్ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ని గద్దె దింపడమే పవన్ టార్గెట్ అంటున్నారు. అందుకోసం ఆయన చంద్రబాబు తో ఏ రకమైన రాజకీయ అవగాహనకు అయినా వస్తారు అంటున్నారు.


ఇక పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలో కూడా పునరాలోచన చేస్తున్నారు అని చెబుతున్నారు. ఏపీలో ప్రభుత్వంతో పేచీ వచ్చినందువల్ల ఆయన సినిమాలు తగ్గించుకుని మరీ మరింత ముందుగా జనంలోకి వస్తారు అన్న మాట కూడా వినిపిస్తోంది. ఇవన్నీ చూస్తూ ఉంటే జగన్ కి పవన్ గట్టి సవాలే చేస్తున్నారు అనుకోవాలి. 2014 నాటి అనుభవాలు రిపీట్ కాకుండా ఉండాలంటే వైసీపీ పవన్ వేసే ఎత్తులకు పై ఎత్తు వేయాల్సి ఉంటుందని కూడా చెబుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: