హైదరాబాద్‌ లో భారీ వర్షాలు కురుస్తున్న తరుణం లో హై అలర్ట్‌ ప్రకటించింది  జీహెచ్‌ఎంసీ. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కారు మబ్బులు కమ్ముకున్నాయని...  మరో నాలు గైదు గంటల పాటు హైదరాబాద్‌లో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది  వాతావరణ శాఖ. ఇలాంటి తరుణం లో  అవసరమైతే తప్ప.. ఎవరు కూడా ఇంట్లో నుంచి  బయటకు రావొద్దని హెచ్చరించింది జీహెచ్‌ఎంసీ. బయట ఉన్న వారు కూడా  వెంటనే ఇళ్లకు వెళ్లి పోవాలని జీహెచ్‌ఎంసీ అధికారులు  హెచ్చరిక లు జారీ చేశారు.  హైదరాబాద్‌ లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యం లో ఎక్కడి కక్కడ  ఉన్నతాధి కారులు అప్రమత్తం అయ్యారు.  

ముఖ్యంగా  లో తట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తం గా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు  జీహెచ్‌ఎంసీ అధికారులు.  బంగాళా ఖాతం లో ఏర్పడిన గులాబ్ తుఫాన్ దృష్ట్యా  ప్రభుత్వ యంత్రాంగం హై అలర్ట్ అయింది  జీహెచ్‌ఎంసీ అధికారుల బృందం.   అంతే కాదు నేడు, రేపు  హైఅలర్ట్ ప్రకటించారు  జీహెచ్‌ఎంసీ అధికారులు. తుఫాన్ నేపథ్యంలో హైదరాబాద్‌లో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు  జీహెచ్‌ఎంసీ అధికారులు.  

అత్యవసర పరిస్థితు ల్లో  ప్రజలు కంట్రోల్‌ రూమ్ 040 - 23202813 నంబర్లకు ఫిర్యాదు చేయాలని సూచనలు చేశారు  జీహెచ్‌ఎంసీ అధికారులు. ఇది ఇలా ఉండగా భారీ వర్షాల కారణంగా నగరం ప్రధాన రహదారులపై భారీగా వరద నీరు నిలిచిపోయింది. పలు కూడళ్ళలో వరద నీరు నిలిచి పోవ డం తో కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కాగా పంజా గుట్ట నుంచి మేహేది పట్నం వరకు  వాహ నాలు కదలనీ పరిస్థితి నెలకొంది.  అపోలో నుంచి పెన్షన్ ఆఫీస్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ జామ్ అయింది. ఈ ట్రాఫిక్ సమస్య కారణంగా ప్రజలు చాలా ఇక్కట్లు పడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: