తెలంగాణాలో ఉపఎన్నిక కోసం బీజేపీ విభజించు పాలించు మరోసారి ప్రయోగించి మొత్తానికి హుజురాబాద్ సీటు ఖాళీ చేయించింది. దీనితో అక్కడ ఉపఎన్నికకు కూడా ఎన్నికల సంఘం నోటిఫికేషన్ కోసం అభిప్రాయం అడుగగా అధికార పార్టీ తెరాస కాస్త ఆగాలని చెప్పిన పరిణామాలు చూశాం. గత ఉపఎన్నికలో బీజేపీ సీటు సొంతం చేసుకున్న తరువాత తెరాస మేల్కుని ఈసారి జాగర్త పడింది. అందుకే రంగంలోకి సరాసరి అధినేత కేసీఆర్ దిగారు. హుజురాబాద్ గురించి వివరాలు తెప్పించుకున్నారు. అంటే అక్కడ ఏ సామజిక వర్గం ఎక్కువ ఉన్నారు.. ఏ పథకం పెడితే వాళ్ళలో మరో ఆలోచన లేకుండా తమవైపు తిప్పుకోవచ్చు.. లాంటి విశ్లేషణ లోతుగానే జరిగింది. అప్పుడే దళితబందు తెరపైకి వచ్చింది.

దానిని అమలు చేసేందుకు సమయం కావాలి అనేది అందరికి తెలుసు. కానీ ఈ సమయంలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తే అప్పటి నుండి కోడ్ అమలు అవుతుంది, దానితో కొత్త పధకాలు తెరపైకి తేవడం వీలుకాదు. అందుకే వాయిదా వేశారు, దళితబందుకు హడావుడిగా బడ్జెట్ విడుదల చేశారు. అంతే హడావుడిగా అసెంబ్లీ సమావేశాలు పెట్టి ఆ బడ్జెట్ ఆమోదించాలి మరి. అంతా చకచకా జరిగిపోతుంది. ఇదే కేసీఆర్. ఇక బీజేపీ కి కూడా అర్ధం అయిపోయి ఉంటుంది, తాము ఖాళీ చేయించిన హుజురాబాద్ మళ్ళీ తెరాస సొంతం అని. అయినా తమ కనీస కృషి ఉండాలి కాబట్టి ప్రచారం చేస్తున్నారు. ఎలాగూ ఈ ప్రచారం సాధారణ ఎన్నికలకు పనికి వస్తుంది అనేది వాళ్ళ ఆలోచన.

ఈ నేపథ్యంలోనే తెలంగాణ లో బీజేపీ స్వయంగా విమోచన దినం అట్టహాసంగా చేస్తుంది. అలాగే అమెరికాలో కూడా బీజేపీ వర్గాలు ఈ రోజును జరపాలని నిర్ణయం తీసుకున్నారు. తాజాగా అది జరిగింది. విమోచన దినం అమెరికా వరకు వెళ్లడం వలన అక్కడ నుండే తెరాస ను దెబ్బకొట్టడానికి  మరియు తెలంగాణ పై బీజేపీ అక్కర చూపుతుంది అనే నమ్మకం ప్రజలలో కలిగించేందుకు ఇవన్నీ ముందస్తు  జాగర్తలు. ఏమో ఈ వ్యూహం ఏ ప్రయోజనం ఆశించి చేస్తుందో బీజేపీ కే తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: