ఎప్పుడూలేని విధంగా పవన్ కల్యాణ్...తన ఫైర్ ఏంటో చూపిస్తున్నారు. రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి పవన్ ఎప్పుడూ...ప్రత్యర్ధులని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి పరుష పదజాలంతో దూషించలేదు. వ్యక్తిగతంగా టార్గెట్ చేసి విమర్శలు చేసి ఉంటారు గానీ, పరుష పదజాలం మాత్రం ఎప్పుడూ వాడలేదు. కానీ మొదటిసారి పవన్ బరస్ట్ అయ్యారు. వ్యక్తిగత దూషణలకు దిగారు. ఇప్పటికే ఏపీ రాజకీయాల్లో అధికార వైసీపీ, ప్రతిపక్ష టి‌డి‌పి నేతల మధ్య బూతుల యుద్ధం జరుగుతుంది.

దీనిలోకి పవన్ కూడా ఎంట్రీ ఇచ్చేశారు. ఊహించని విధంగా వైసీపీ నేతలని పరుష పదజాలంతో దూషించారు. అంటే పవన్..తన టార్గెట్ జగన్‌ అని స్పష్టంగా తేల్చేశారు. ఇక పవన్ అన్నీ మాటలు మాట్లాడక వైసీపీ నేతలు చేతులు కట్టుకుని కూర్చోరు కదా...వారు కూడా తమ నోటికి పనిచెప్పారు. ముఖ్యంగా మంత్రి పేర్ని నాని తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఆయన కూడా కంట్రోల్ తప్పి పవన్‌ని దూషించారు.


ఇలా పవన్, వైసీపీ నేతల మధ్య రచ్చ మొదలైంది. వరుసపెట్టి వైసీపీ నేతలు మీడియా సమావేశం పెట్టి పవన్‌ని తిట్టడం, అటు జనసేన నేతలు సైతం మీడియా సమావేశం పెట్టి జగన్, నానిలని తిడుతున్నారు. పైగా పవన్ ఇంకా ఏపీ రాజకీయాల్లో ఫుల్ యాక్టివ్ అవ్వనున్నారని తెలుస్తోంది. అందుకే జగన్ ఎన్నికల ముందు ఎలాంటి హామీలు ఇచ్చారు. ఎన్నికలయ్యాక ఆ హామీల విషయంలో ఎలా మాట తప్పారనే విషయాలని హైలైట్ చేసే ప్రయత్నం చేశారు. ఇక రాను రాను పవన్ ప్రజాక్షేత్రంలోకి దిగి జగన్‌ని టార్గెట్ చేసి రాజకీయం చేయడం మొదలుపెట్టనున్నారని తెలుస్తోంది.

అయితే పవన్, చంద్రబాబుని ఒక్క మాట కూడా అనడం లేదు. మరి పవన్ కేవలం జగన్‌నే టార్గెట్ చేశారన్ అర్ధమవుతుంది. మరి చంద్రబాబుని ఏం అనడం లేదంటే....అందులో ఏం రాజకీయం ఉందో ఎవరికి అర్ధం కావడం లేదు. జగన్‌ని విలన్‌గా చూస్తున్న పవన్...బాబుకు సపోర్ట్‌గా ఉండబోతున్నారా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: