చంద్రబాబు-పవన్ కల్యాణ్‌లు పొత్తు పెట్టుకుని నెక్స్ట్ ఎన్నికల్లో జగన్‌ని ఢీకొట్టబోతున్నాయని గత కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాల్లో ప్రచారం నడుస్తున్న విషయం తెలిసిందే. చంద్రబాబు ఎలాగో సింగిల్‌గా జగన్‌ని ఎదురుకోలేకపోతున్నారు..ఆయనకు చెక్ పెట్టలేకపోతున్నారు. వరుసపెట్టి స్థానిక ఎన్నికల్లో ఓడిపోయారు. అటు బి‌జే‌పితో పొత్తు పెట్టుకుని ముందుకెళుతున్న పవన్ సైతం ఏ మాత్రం సత్తా చాటలేకపోతున్నారు. పైగా బి‌జే‌పితో పొత్తు పెట్టుకోవడం వల్ల జనసేనకే పెద్ద బొక్క పడింది.

దీంతో టి‌డి‌పి-జనసేనలు పొత్తు పెట్టుకుంటే బెటర్ అనే విధంగా విశ్లేషణలు వస్తున్నాయి. ఇదే క్రమంలో ఎంపీపీ ఎన్నికల్లో టి‌డి‌పి-జనసేనలు పొత్తు పెట్టుకుని కొన్ని మండలాల్లో సత్తా చాటాయి. పలు స్థానాల్లో వైసీపీకి చెక్ పెట్టాయి. దీంతో టి‌డి‌పి-జనసేనల పొత్తు ఖాయమైపోయిందని ప్రచారం మొదలైంది. పైగా గోదావరి జిల్లాలకు చెందిన పలువురు టి‌డి‌పి నాయకులు, పవన్ కల్యాణ్‌తో కలిసి ముందుకెళితే బెటర్ అని సూచిస్తున్నారు.

ఇటు జనసేన నేతలు కూడా అదే బాటలో ఉన్నారని తెలుస్తోంది. టి‌డి‌పితో పొత్తు ఉంటే కొన్ని స్థానాలైన గెలవచ్చని అనుకుంటున్నారట. ఇప్పుడు పవన్ సైతం జగన్‌ని గట్టిగా టార్గెట్ చేసి రాజకీయం మొదలుపెట్టారు. బాబుని ఒక్క మాట కూడా అనకుండా జగన్‌పై విరుచుకుపడుతున్నారు. దీంతో పవన్-బాబు ఒక అండర్‌స్టాండింగ్‌కు వచ్చారని ప్రచారం మొదలైంది. అయితే టి‌డి‌పి-జనసేనల పొత్తుపై కొందరు తెలుగు తమ్ముళ్ళు పెదవి విరుస్తున్నారు. ఏదో అవసరం ఉందని ఇప్పుడు పవన్‌తో పెట్టుకుంటే, గెలిచాక తమ వల్లే గెలిచారని పవన్ హడావిడి చేస్తారని, అలాగే జనసేన కార్యకర్తలు కూడా మామూలు రచ్చ చేయరని, ఆ పోరు మనం పడలేమని కొందరు టి‌డి‌పి నేతలు గుసగుసలాడుకుంటున్నారు.

2014లో అధికారంలోకి వచ్చినప్పుడు పవన్ ఏం చేశారో గుర్తు చేసుకుంటున్నారు. పైగా పొత్తు వల్ల కొన్ని సీట్లు టి‌డి‌పి వదులుకోవాల్సి వస్తుందని,ఇప్పటికే 175 నియోజకవర్గాల్లో పార్టీకి నేతలు ఉన్నారని, ఇలాంటి సమయంలో కొన్ని సీట్లు వదులుకుంటే ఆ సీట్లలో టి‌డి‌పి ఉనికికే ప్రమాదం వస్తుందని, అందుకే పవన్‌తో పొత్తు అనవసరమని తమ్ముళ్ళు మాట్లాడుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: