కమ్యూనిస్టు పార్టీల నేతృత్వంలో 19 రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలను కూడగట్టుకొని రైతు వ్యతిరేక చట్టాలని తెచ్చినప్పుడు ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రజల తరఫున, పేదోళ్ల తరఫున ఈ దేశానికే  పట్టుకొమ్మలైన వ్యవసాయం చేసుకునే రైతుల తరపున దాదాపుగా పది నెలల నుంచి మొక్కవోని ధైర్యంతో ని పోరాటాలు జరుగుతున్నాయి. ఢిల్లీ సరిహద్దుల్లో సింగూర్, గాజా బాద్లో  వేలాది మంది రైతులు గత పది నెలలుగా రైతు వ్యతిరేక నూతన నల్ల చట్టాల ను రద్దు చేయాలని ఎండకు ఎండి,  వానకు తడిసి,  చలికి వణికి దాదాపుగా నాలుగు వందల మంది రైతులు బలి అయ్యారు ఢిల్లీ సరిహద్దుల్లో. 400 మంది రైతులు ప్రాణాలను అర్పించి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.

అదానీ,  అంబానీ ల కోసం 130 కోట్ల మంది ప్రజల యొక్క హక్కులను కాల రాయడానికి నరేంద్ర మోడీ, అమిత్ షా లు కంకణం కట్టుకున్నారు. తమ్మినేని వీరభద్రం, విమలక్క, సంధ్యలు చెప్పినట్లు తెలంగాణ ప్రజలు ఇవాళ ఈ దేశంలో వచ్చిన సమస్య వందల సంవత్సరాలు ఈ దేశాన్ని తెల్లదొరల పాలనలో ఉంటే లక్షలాది మంది తమ ప్రాణ త్యాగాలు చేసి తెల్లదొరలను ఈ దేశం నుంచి తరిమి కొట్టారు. స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత తిరిగి మధ్యయుగాల వైపు, రాచరిక పాలన వైపు, పెట్టుబడిదారుల చేతుల్లో ఈ దేశాన్ని బంధించడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది.

ఇవాళ గుజరాత్ నుంచి బయలుదేరిన నలుగురు ఇద్దరూ అమ్మకందారులు గా, ఇద్దరూ కొనుగోలుదారులు గా తయారయ్యి ఈ దేశాన్ని దోచుకుంటున్నారని అన్నారు. దేశంలోనే రోడ్లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టులు, ఓడరేవులు ఇంకా మరెన్నో ఈ దేశంలో పేద ప్రజలు వినియోగించే  ప్రతి ఒక్క రవాణా సౌకర్యాన్ని నిలువు వేసి, దేశంలోని అన్ని అదానీ అంబానీ చేతుల్లో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్లానింగ్ చేస్తోందని ఆయన విమర్శించారు. అలాగే వ్యవసాయం లో కూడా  వ్యవసాయ వ్యతిరేక చట్టాలను తీసుకు వచ్చి రైతులను ఇబ్బంది పెడుతున్నారని రేవంత్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: