చైనా తన ఆదిపద్యం అనే జాడ్యం కోసం అనేక దేశాలను పీడిస్తూనే ఉంటుంది. అలా దానికి బలవ్వని పొరుగుదేశం లేదంటే అతిశయోక్తికాదు. ఇక ప్రపంచం నుండి ఉత్పత్తి సామర్ధ్యాన్ని ఆకర్షించిన తరువాత తానే బలమైన దేశం అనుకుంటూ ఎవరిని లెక్క చేయకుండా ఇష్టానికి అందరిపై వాణిజ్య లేదా సరిహద్దు లేదా మరో రకంగా దాడులు చేస్తూనే ఉంది. హాంకాంగ్, తైవాన్ లాంటి స్వతంత్ర ప్రాంతాలను తనవే అంటూ ఆధిపత్యం కోసం వాటిని పట్టిపీడించి మొత్తానికి హాంకాంగ్ ను కాజేసింది. ఇప్పుడు తైవాన్ పై కన్ను వేసింది. కొన్నాళ్లుగా అనేక విధాలుగా వేధిస్తూనే ఉంది. భారత్ సహా ఏ సరిహద్దు దేశాన్ని కూడా వదల కుండా పీడిస్తూనే ఉన్న దౌర్భాగ్య దేశం చైనా.

తాజాగా తైవాన్ ను కాజేయాలని అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అందుకే తైవాన్ తన ఉత్పత్తి సామర్ధ్యాన్ని చైనా తో కాకుండా భారత్ తో ఒప్పందం చేసుకుంది. చిప్(సెమి కండక్టర్) ల తయారీ నేటి సాంకేతిక విప్లవంలో చాలా అత్యవసరమైన వనరు. అది కరోనా కారణంగా దిగుమతి చేసుకోవడానికి కష్టమై అనేక సంస్థలు వారివారి ఉత్పత్తులను నిలిపివేయాల్సి వచ్చింది. ఈ సమస్యను అధిగమించేందుకు తైవాన్ భారత్ మధ్య చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. దీనితో చైనా కు చెక్ పెట్టినట్టు అయ్యింది. దాదాపు ప్రపంచ అవసరాలలో 80 శాతం చిప్స్ తైవాన్, దక్షిణ కొరియా మాత్రమే ఉత్పత్తి చేస్తూ  ఉంటాయి. ఇప్పుడు చైనా పై గుర్రుగా ఉన్న ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే తైవాన్-భారత్ ల మధ్య వాణిజ్య ఒప్పందం స్వాగతించతగ్గది. ఈ ఒప్పందం ప్రకారం భారత్ లో తైవాన్  55. 23 కోట్ల డాలర్ల పెట్టుబడి తో చిప్ ఉత్పత్తి కేంద్రాన్ని పెట్టనుంది. ఇందులో 5జి పరికరాల నుండి ఎలక్ట్రిక్ కార్ల భాగాల ఉత్పత్తి వరకు ఉండనున్నాయి. ఇటీవల జరిగిన క్వాడ్ సమావేశం నేపథ్యంలో ఈ ఒప్పందం చోటుచేసుకుంది. భారత్ మాత్రమే 1.77 లక్షల కోట్ల విలువైన చిప్ లను దిగుమతి చేసుకుంటుంది. 2025 నాటికి దీనివిలువ 7.38 లక్షల కోట్లకు చేరనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: