చైనా తన ఆక్రోశాన్ని భారత్ పై వీలు ఉన్నప్పుడల్లా చూపిస్తూనే ఉంది. తనకంటే ముందుకు పోతుందనే అక్కసు ఎప్పుడు కుదిరితే అప్పుడు వెళ్ళకక్కుతుంది. అయితే సరిహద్దులు లేకపోతే వాణిజ్యం లేదా మరోచోట ఎక్కడ కుదిరితే అక్కడ భారత్ తో ఏదో ఒక గొడవ పడుతూనే ఉంటుంది. సాధారణంగా మనం బాగుపడాలి అంటే మన గురించి ఆలోచించుకుంటూ పోతుండాలి, ఇది రాజమార్గం; లేదా పక్కవాడిని ముందుకు పోకుండా నిలువరిస్తూ ఉండాలి, ఇది నీచమార్గం. చైనా రెండో మార్గంలో భారత్ పై తన ప్రణాళికలు రచిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా తైవాన్-భారత్ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం దానికి మింగుడు పడక ఎలాగైనా అక్కసు వెళ్ళగక్కాలని భారతీయ విద్యార్థులు కరోనా కారణంగా స్వదేశానికి వచ్చేసిన వారిని తిరిగి ఇప్పటికి కూడా ఆ దేశానికి రాకుండా ఏవేవో కారణాలు చెప్పుకుంటూ వస్తుంది.

భారతీయ విదార్దులపై చైనా ఇంకా ఆంక్షలు తొలగించలేదు. అడిగితే కరోనా కారణంగానే అనే సాకు చూపిస్తుంది ఆ దేశం. దీనితో విద్యార్థులు దాదాపు 23 వేలమంది తమ చదువుల గురించి ఆందోళనకు గురి అవుతున్నారు. అలాగే చైనా లో వ్యాపారాలు చేసుకునే వారు కూడా భారత్ నుండి ఆ దేశానికి తిరిగి వెళ్ళేది ఎప్పుడో అనుకుంటూ తమ వ్యాపారాల గురించి ఆందోళన కు గురి అవుతున్నారు. ఈ అర్ధం లేని ఆంక్షలను అక్కడి చైనా రాయబారి కూడా వ్యతిరేకించడం జరిగింది. ఇలా కుదిరినప్పుడల్లా చైనా భారత్ పై ఏవో కారణాలు చెప్పి తప్పుడు ఆరోపణలు చేస్తూనే ఉంది.

అటు ఐక్యరాజ్య సమితిలో కూడా భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం ఇన్నాళ్లు భారత్ కు లేకపోవడానికి కారణం కూడా చైనా మాత్రమే. అదొక్కటి ఒప్పుకుంటే ఇంకా విభేదించే వారు ఎవరు లేరనే చెప్పాలి. ఇలా ప్రతి విషయంలోనూ భారత్ ను నిలువరించేందుకు చైనా తీవ్రంగా కృషి చేస్తూనే ఉంది. ఇవన్నీ చూస్తుంటే ఆఫ్ఘన్ ఆక్రమణలో కూడా ఈ అక్కసు తోనే తాలిబన్ లకు సాయం చేసిందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తద్వారా భారత్ లో తీవ్రవాదం తో రక్తపాతం సృష్టించవచ్చు, భారత్ కు ప్రతిక్షణం మనశాంతి లేకుండా చేయవచ్చు.. అనేది దాని నీచపు ఆలోచన  కావచ్చు అంటున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: