గులాబ్ తుఫాన్ ప్రభావం అసెంబ్లీ సమావేశాలపై కూడా పడింది. భారీ వర్షాల కారణంగా మూడు రోజులు వాయిదా వేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. అక్టోబర్1నుంచి తిరిగి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఈ నెల 24 నుంచి ప్రారంభమయ్యాయి.

గులాబ్ తుఫాన్ కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు స్కూళ్లకు సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. B.PEd, D.PEd కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించాల్సిన ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ వాయిదా పడింది. గులాబ్ తుఫాన్ తో భారీ వర్షాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని ఉన్న విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి ప్రకటించారు. షెడ్యూలు ప్రకారం ఈ నెల 30న ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ జరగాల్సి ఉండగా.. దాన్ని అక్టోబర్ 23కు వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. టెస్ట్ సెంటర్, హాల్ టికెట్లలో ఎలాంటి మార్పులు ఉండవని ఆయన పేర్కొన్నారు.

ఇక ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో నేడు, రేపు జరగాల్సిన డిగ్రీ పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు అధికారులు చెప్పారు. ఈ నెల 30నుంచి జరగాల్సిన ఇతర పరీక్షలు యథాతథంగా జరుగుతాయన్నారు. అలాగే ఈ రోజు జరగాల్సిన బీటెక్, ఫార్మసీ సప్లిమెంటరీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు JNTUH తెలిపింది. రేపు జరగాల్సిన పరీక్షలు యథాతథంగా జరుగుతాయని JNTU రిజిస్ట్రార్ తెలిపారు.

మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలో సెప్టెంబర్ 28, 29 తేదీల్లో జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. మిగతా తేదీల్లో నిర్వహించాల్సిన పరీక్షల్లో మాత్రం ఎలాంటి మార్పులు లేవని.. వాయిదా పడిన పరీక్షల తేదీలను తర్వాత ప్రకటిస్తామని అధికారులు చెప్పారు.


ఛత్తీస్ ఘడ్ నుంచి తెలంగాణ మీదుగా స్వల్పంగా గాలులు వీస్తున్నాయి. అయితే ఈ రోజు కూడా భారీ వర్ష సూచన కారణంగా ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది.

 



 

మరింత సమాచారం తెలుసుకోండి: