రాజకీయాల్లో పవన్ కల్యాణ్.. అల్లు అర్జున్ సినిమా డైలాగ్ ని రిపీట్ చేస్తున్నారు. తగ్గేదే లేదంటూ మరోసారి తనదైన స్టైల్ లో వైసీపీ నేతలపై సెటైర్లు వేశారు. రిపబ్లిక్ సినిమా వేదికపై చెప్పిన డైలాగులకంటే.. ఇప్పుడు పవన్ ట్విట్టర్లో వేసిన సెటైర్లే మరింత రచ్చకు కారణం అయ్యేలా ఉన్నాయి. పవన్ కల్యాణ్ ఈ విషయాన్ని తెగేదాకా లాగుతున్నారా అనే అనుమానాలు మొదలయ్యాయి.

సహజంగా సినిమా వాళ్లకి, రాజకీయ నాయకులకు మధ్య విభేదాలు వస్తే.. ఎక్కడో ఒక చోట బ్రేక్ పడుతుంది. సముదాయింపులు, సర్దుబాట్లతో సమస్య సద్దుమణిగిపోతుంది. కానీ ఇక్కడ పవన్ కల్యాణ్ సినీ పొలిటీషియన్ కావడంతో వ్యవహారం ఇంకాస్త పెద్దదయ్యేలా కనిపిస్తోంది. తనపై విమర్శలు చేసినవారందరికీ కలిపి పవన్ ఘాటుగా బదులిచ్చారు. గ్రామసింహాలంటూ ఆయన ఇచ్చిన కౌంటర్ వైసీపీ నేతలకు ఘాటుగానే తగులుతుందనడంలో అనుమానం లేదు.నెక్స్ట్ ఎపిసోడ్ ఏంటి..?
సన్నాసి అన్న మాటకే వైసీపీ మంత్రులు పవన్ పై ఓ రేంజ్ లో ధ్వజమెత్తారు. ఇప్పుడు ఏకంగా గ్రామసింహాలంటూ అందరికీ మరింత మండేలా సెటైర్లు వేశారు పవన్.. రోజంతా జనసేన తరపున ఇతర నాయకులు చేసిన వ్యాఖ్యలు ఒకెత్తు.. రాత్రికి పవన్ వేసిన ట్వీట్ మరో ఎత్తు అనేలా ఉంది. అందుకే నెక్స్ట్ ఎపిసోడ్ ఏంటా అనే ఆసక్తి అందరిలో పెరిగింది.

వైసీపీ నేతలు ఊరుకునే సమస్యే లేదు. మరి ఈరోజు వారి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. మరోవైపు పవన్ ఈ ఎపిసోడ్ ని కంటిన్యూ చేసుకుంటూ పోతుండే సరికి సినీ వర్గాల్లో కూడా ఆందోళన మొదలైంది. ఇప్పటికా చాలా నష్టం జరిగిందని, ఇకపై ప్రభుత్వం మరింత పంతానికి పోతే మొదటికే మోసం వస్తుందని ఇండస్ట్రీ పెద్దలు భావిస్తున్నారు. అందుకే ఎవరూ పవన్ వ్యాఖ్యల్ని సమర్థించేలా మాట్లాడలేదు, స్టేట్ మెంట్లు ఇవ్వలేదు. ఇప్పుడు మరోసారి పవన్ కాస్త ఘాటుగా తగులుకునే సరికి ఈ వ్యవహారం ఇంకెంత దూరం వెళ్తుందోనని భయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: