సీఎం కేసీర్ రాజ‌కీయాల్లో త‌న‌కంటూ ఒక ప్ర‌త్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎలాంటి సంద‌ర్భం అయినా, ఏ రాజ‌కీయ ఇష్యూ అయిన త‌న నేర్ప‌రితో ఆ ప‌రిస్థితిని మలుపు తిప్ప‌గ‌ల రాజ‌కీయ చాణ‌క్యుడు సీఎం కేసీఆర్‌. త‌న‌కు అవ‌స‌రం ఉందంటే రెండు అడుగులు వేయడానికైనా.. ముందుకు దూసుకెళ్లడానికి అయినా.. ఇట్టే సిద్దం అవుతారు. ఎవ‌రిని ఏ విధంగా వాడుకోవాలో గులాబీ బాస్ కేసీఆర్‌కు తెలిసినంతగా మారెవ‌రికి తెలియ‌ద‌ని చెప్ప‌డం లో ఎలాంటి సందేహం లేదు.
 

  అయితే, బీజేపీ పై ఎప్పుడు బుస‌లు క‌క్కె కేసీఆర్‌.. గ‌త కొన్ని రోజులుగా ఎందుకో తెలియ‌దు గానీ.. బీజేపీతో సాన్నిహిత్యాన్ని పెంచుకుంటున్నారు. రాష్ట్రంలో ఎలా ఉన్న కేంద్రంతో మాత్రం తెర‌వెనుక స్నేహం నడిపిస్తున్నాడ‌నేది ప్ర‌తిప‌క్ష‌ల వాద‌న‌.. ఇందుకు త‌గ్గ‌ట్టు కేసీఆర్ కేంద్ర బీజేపీ నాయ‌కుల‌ను క‌ల‌వ‌డం.. త‌న‌కు కావాల్సిన ప‌ని చేయించుకోవ‌డం కొన‌సాగుతూ వ‌స్తోంది. అలాగే, కొన్ని బిల్లుల‌కు కూడా పార్ల‌మెంట్ బీజేపీకి స‌పోర్ట్ చేశారు టీఆర్ ఎస్ ఎంపీలు. అలాగే, బీజేపీకి వ్య‌తిరేకంగా కాంగ్రెస్ ఏర్పాటు చేసిన భేటీకీ, ప్ర‌తిప‌క్షాల‌న్ని హాజ‌ర‌య్యాయి. కానీ, టీఆర్ ఎస్ మాత్రం దూరం ఉండిపోయింది.


   అయితే, కేంద్ర ప్ర‌భుత్వం తీసుకు వ‌చ్చిన మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాలకు రాష్ట్ర‌ప‌తి ఆమోదం తెలిపి. ఏడాది అయిన సంద‌ర్భంగా చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా నిన్న చేప‌ట్టిన భార‌త్ బంద్‌లో  బీజేపీకి వ్య‌తిరేక ప్ర‌తిప‌క్ష పార్టీలు కాంగ్రెస్‌, వామ‌ప‌క్ష పార్టీలు, ఇత‌ర పార్టీలు పాల్గొన్నాయి. అలాగే పక్క‌నే ఉన్న ఏపీ ప్ర‌భుత్వం కూడా బంద్ కు సంఘీభావం తెలిపింది. కానీ, గ‌తంలో ఈ వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకించి టీఆర్ఎస్ మాత్రం ఈ బంద్ లో పాల్గొన‌లేదు క‌నీసం మ‌ద్ద‌తు కూడా తెలుప‌లేదు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి కేసీఆర్‌ను విమ‌ర్శించారు. రైతు చ‌ట్టాల‌కు ముందు కేసీఆర్ వ్య‌తిరేకించార‌ని, కానీ ఇప్పుడు మోడీ ఏ మాయ చేశారో గానీ కేసీఆర్ లో మార్పు వ‌చ్చింద‌ని, బంద్‌లో పాల్గొన‌కుండా మోడీతో కేసీఆర్ విందులో పాల్గొంటున్నార‌ని విమ‌ర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: