గద్వాల విజయలక్ష్మి... గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ మేయర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో మేయర్‌ స్థానంలో కూర్చున్న తర్వాత... ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. గతేడాది సరిగ్గా ఇదే సమయంలో భారీ వర్షాలకు హైదరాబాద్ నగరం పూర్తిగా మునిగిపోయింది. ఇంకా చెప్పాలంటే... నగరంలోని చాలా కాలనీలో వారం రోజుల పాటు నీటిలోనే నానిపోయాయి. హైదరాబాద్ నగర వాసులు తొలిసారిగా పడవలపై ప్రయాణం కొనసాగించారు. కొన్ని కాలనీల్లో మొదటి అంతస్తులు పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో... ప్రజలంతా మేడపైకి ఎక్కి బిక్కు బిక్కు మంటూ కాలం గడిపారు. చాలా ప్రాంతాల్లో సహాయక చర్యలు నెమ్మదిగా సాగడంతో వారం నుంచి పది రోజుల పాటు ప్రజలంతా ఇళ్లపైనే నివసించారు. ప్రభుత్వ సహాయం కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూశారు. చాలాచోట్ల ప్రజా ప్రతినిధులను నిలదీశారు కూడా.

వర్షాలు హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తిన 6 నెలలకు నగర మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన గద్వాల విజయలక్ష్మి... చేసిన కామెంట్లు ఇప్పుడు మరోసారి అంతా గుర్తు చేసుకుంటున్నారు. మరో ఐదేళ్ల పాటు వర్షాలు పడకూడదని కోరుకుంటున్నట్లు ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయలక్ష్మి వ్యాఖ్యానించారు. వర్షాలు ఎక్కువగా రావడం వల్లే హైదరాబాద్ నగరం మునిగిపోయిందన్నారు. ఇప్పుడు నగర వాసులు ఆ కామెంట్లను గుర్తు చేసుకుంటున్నారు. ప్రజలకు సహాయక చర్యలు చేపట్టాల్సిన మేయర్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలియటం లేదని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఓట్లు అడిగేందుకు వస్తారు తప్ప... ప్రజలను వరద కష్టాల నుంచి గట్టెక్కించేందుకు మాత్రం మేయర్ గద్వాల విజయలక్ష్మి, కార్పొరేటర్లు రావడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలను కష్టాల నుంచి గట్టు ఎక్కించాల్సిన నేతలు... ఇలా వర్షాలు పడకూడదు అంటూ కోరుకోవటం సరైందేనా అని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం మేయర్ ఎక్కడ ఉన్నారో కూడా తెలియటం లేదంటున్నారు నగర వాసులు.


మరింత సమాచారం తెలుసుకోండి: