ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో ఉప ఎన్నికలు జరుగుతున్నప్పటికీ... తెలుగు రాష్ట్రాల ప్రజలు మాత్రం ఏపీ పాలిటిక్స్ మీదే చర్చించుకుంటున్నారు. అధికార పార్టీపై ప్రతిపక్షాల ఆరోపణలు... మాటల యుద్ధాలు... ఎదురుదాడులు... ఇలా ప్రతి రోజు మెజారిటీ వార్తలు ఏపీ నుంచే. ట్విట్టర్‌లో ఒకరిపై ఒకరు విమర్శలు... ఎలా ఎన్నో ఎన్నెన్నో... ఇప్పుడు మరో వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014 నాటి పరిస్థితులు పునరావృతం అయ్యేలా ఉన్నాయని వార్త తెగ హల్ చల్ చేస్తోంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ కలిసి ఈ ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నాయి. అయితే జనసేన పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు. కానీ... ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మాత్రం... రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించి.. టీడీపీకి ఓటు వేయాలని కోరారు.

ఆ తర్వాత అనూహ్యంగా ఈ మూడు పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయి. ముందు జనసేన పార్టీ విడిపోగా... ఆ తర్వాత బీజేపీతో టీడీపీ తెగదెంపులు చేసుకుంది. 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత బీజేపీ, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. కానీ అనూహ్యంగా పరిషత్ ఎన్నికల ఫలితాల తర్వాత... రాష్ట్రంలో కొత్త పొత్తులు తెరపైకి వచ్చింది. చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నేతలు లోపాయి కారి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎంపీపీ స్థానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కకుండా... జనసేన, టీడీపీ నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరించి సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఇదే అంశం రాష్ట్ర స్థాయిలో హాట్ టాపిక్‌గా మారింది. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకుంటున్నాయనే వార్తలు ట్రోల్ అవుతున్నాయి. కొంత మంది మరో అడుగు ముందుకు వేసి... జనసేనా పార్టీకి 25 ఎమ్మెల్యేలు, 5 ఎంపీ స్థానాలు ఇచ్చేందుకు కూడా టీడీపీ అంగీకరించినట్లు చెబుతున్నారు. చూడాలి... రాబోయే ఎన్నికల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: