ఆంధ్ర ప్రదేశ్ లో ఏం జరుగుతోంది ?
కోర్టు తాకీదులు అందుకోవడం, వ్యాఖ్యలు చేయించుకోవడం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి షరా మామూలైపోయింది. 'ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం పై దాఖలైన పిటీషన్ లకు సంబంధించి తగు చర్యలు తీసుకోవాలని, అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించాం. దీనిపై ఎం జరుగుతోందో తేలియడం లేదు'. అని ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మరోసారి వ్యాఖ్యానించింది. ఆంధ్ర ప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైె.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుడు, సత్తెన పల్లి నియోజక వర్గం నంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అంబటి రాంబాబు, అతని సన్నిహిత సహచరుల పై గతంలో హై కోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఈ వ్యాజ్యం పై వాదనలు విన్న కోర్టు దీనిపై వివరణ ఇవ్వాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
 దాదాపు ఏడాది కాలం గడిచాక   కొందరు వ్యక్తులు ఈ వ్యాజ్యం పై   తమ అఫిడవిట్ ను దాఖలు చేశారు.. తమకు ప్రభుత్వం అనవసరంగా నోటీసులు జారీ చేసిందని,   ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంలో పేర్కోన్న వారిని వదిలేసి తమను అనవసరంగా కేసుల్లో ఇరికిస్తున్నారని  వారు తమ ఆవేదనను కోర్టుకు విన్నవించారు. తాము నిర్దోషులమని నిరూపించుకునే అవకాశం ఇవ్వాలని  కూడా వారు న్యాయ స్థానాన్ని అభ్యర్థించారు.దీంతో  హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గోస్వామి,  జస్టిస్ జయసూర్యలతో కూడిన ధర్మాసనం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పై  తీవ్రంగా స్పందించింది.  ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంలో పేర్కొన్న వారికి   కాకుండా వేరే వాళ్లకు నోటీసుల ఇవ్వడం ఏంటని ప్రశ్నించింది. ప్రభుత్వం తరపున  న్యాయవాది జగన్ మోహన్ రెడ్డి కాసా తన వాదనలు వినిపించారు. అనుమతులు లేకుండా తవ్వకాలు జరుపుతున్న వారికి నోటీలు ఇచ్చామని, వారి నుంచి  అపరాధరుసుం చెల్లించాలని వసూలు చేయనున్నట్లు చెప్పారు.  ఈ విషయంలో అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. గుంటూరు జిల్లా రాజుల పాళెం మండలంలో కుబాదుపురం,  కోనేటి మల్లిపురి గ్రామాల్లో  ప్రభుత్వ భూములున్నాయి. వీటిలో అక్రమ మైనింగ్  జరుగుతోందంటూ   ప్రభుత్వానికి పలువురు విజ్ఞప్తి చేశారు. ఫలితం లేకపోవడంతో కోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాఖ్యం దాఖలు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: