ప్ర‌పంచాన్ని అత‌లాకుతం చేసిన క‌రోనా మ‌హమ్మారి పుట్టుక‌పై మ‌రోసారి ద‌ర్యాప్తున‌కు రంగం సిద్ధం అవుతుంద‌ని తెలుస్తోంది. క‌రోనా మూలాలు క‌నిపెట్టేందుకు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్యూహెచ్ ఓ ) మ‌రోసారి ప‌రిశోధ‌న‌లు ప్రారంభించే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఈ సంద‌ర్భంగా ప్ర‌త్యేక బృందాన్ని ఈ వారం చివ‌రిలోగా ఏర్పాటు చేస్తుంద‌ని, ఈ కొత్త బృందం ఆధ్వ‌ర్యంలో ప‌రిశోధ‌న‌లు జ‌ర‌గనున్నాయని.. వాల్‌స్ట్రీట్ త‌న క‌థ‌నంలో ప్ర‌చూరించింది. జెనెటిక్స్‌, జంతు వ్యాధుల నిపుణులు, అంటు వ్యాధుల నిపుణులు, బ‌యో సెక్యూరిటీ, లేబోరేట‌రీ సేఫ్టీ లాంటి త‌దిత‌ర రంగాల్లో నిపుణుల‌యిన దాదాపు 20 మంది శాస్త్ర‌వేత్త‌ల‌ను ఈ బందంలో ఉండ‌నున్నార‌ట‌, ఈ ప‌రిశోధ‌న‌లు చైనాతో పాటు ఇత‌ర ప్రాంతాల్లో ఆధారాలు సేక‌రిస్తార‌ని పేర్కొంది.


    అయితే, గ‌తంలోనై డ‌బ్యూహెచ్ ఓ - చైనా సంయుక్తంగా క‌రోనా పుట్టుక‌పై విచార‌ణ చేప‌ట్టిన విష‌యం విధిత‌మే. దీనికి సంబంధించిన‌ నివేదికను  మార్చిలో  విడుద‌ల చేశారు కూడా.. వూహాన్‌లోని ల్యాబ్ నుంచే క‌రోనా వైర‌స్ బ‌య‌ట‌కు వ‌చ్చింద‌న్న ఆరోప‌ణ‌ల‌ను ఈ నివేదిక‌లో తోసిపుచ్చారు. ఈ నేప‌థ్యంలో వుహాన్‌లోని ప్ర‌యోగ‌శాల‌లు, మార్కెట్ల‌లో రెండో విడుత ప‌రిశోధ‌న‌లు చేప‌ట్టాల‌ని జులైలో ప్ర‌తిపాదించారు డబ్ల్యూహెచ్ఓ   డైరెక్ట‌ర్ టెడ్రోస్ అథానోమ్‌. కానీ, దీన్ని చైనా తిర‌స్కరించిన సంగ‌తి తెలిసిందే. యూఎస్‌లోని ఆర్మి మెడిక‌ల్ రీసెర్చ్ ఆఫ్ ఇన్ఫెక్ష‌న్ డిసీజెస్  స‌హా ఇత‌ర దేశాల్లోనూ ప‌రిశోధ‌న‌లు చేయాల‌ని అప్ప‌ట్లో డ‌బ్ల్యూహెచ్ ఓ ను డిమాండ్ చేశారు డ్రాగ‌న్ కంట్రీ శాస్త్ర‌వేత్త‌లు.
 

  అయితే, డబ్ల్యూహెచ్ఓ కొత్త బృందాన్ని త‌మ దేశంలోకి అనుమ‌తించాలా లేదా అన్న విష‌యంపై స్ప‌ష్టం చేసేందుకు నిరాక‌రించింది చైనా ప్ర‌భుత్వం. ఈ త‌ర‌హా ప‌రిశోధ‌న‌ల‌ను చైనా అంగీక‌రిస్తుంది, అనుమ‌తిస్తుంది.. కానీ, ఈ ప‌రిశోధ‌న ముసుగులో రాజ‌కీయ కుట్ర‌ల‌ను వ్య‌తిరేకిస్తున్నామ‌ని  చైనా అధ్య‌క్షుడు షీ జిన్‌పింగ్ ఐరాస వేధిక‌గా స్ప‌ష్టం చేశారు. ఈ నేప‌థ్యంలో శాస్త్ర‌వేత్త‌ల చైనా ప‌ర్య‌ట‌న‌పై ఇంకా  ఎలాంటి స్ప‌ష్ట‌త‌నివ్వ‌లేదు డబ్ల్యూహెచ్ఓ.

మరింత సమాచారం తెలుసుకోండి: