నేటి సమాజంలో రోజురోజుకీ మహిళలపై హత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు కోయంబత్తూర్ లో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు సమాజం తల దించుకునేలా చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే, కోయంబత్తూర్ లోని రెడ్ ఫీల్డ్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కాలేజ్ లో ఒక మహిళా అధికారిపై హత్యాచారం జరిగింది. స్వయంగా సదరు మహిళ ఈ విషయాన్ని ఇండియన్ ఏయిర్ ఫోర్స్ అధికారులకు తెలియచేసింది. అయితే వీరు ఈ ఘటనపై స్పందించలేదు. ఈ నేరానికి పాల్పడిన వ్యక్తిపై ఎటువంటి చర్య తీసుకోలేదు. అయితే ఆ మహిళ ఎంతో ఆగ్రహానికి గురయింది. తాను పనిచేస్తున్న దగ్గర తనకు అన్యాయం జరిగినా పట్టించుకోకపోవడంతో తీవ్ర నిరాశకు లోనయింది. ఇక చేసేది ఏమీ లేక కోయంబత్తూర్ కమిషనర్ ను కలిసి విషయంతా వివరించింది. ఈ ఘటన విన్న సదరు కమిషనర్ వెంటనే చర్య తీసుకున్నారు.

అయితే ఈ ఘటన ఎలా జరిగిందో తెలుసుకుని కమిషనర్ ఎంతో ఆవేదనకు గురయ్యారు. సెప్టెంబర్ 10 వతేదీన 29 సంవత్సరాల మహిళా అధికారి కాలేజ్ గ్రౌండ్ లో గేమ్స్ ఆడుతూ కింద పడడంతో కాలికి గాయం అయింది. దీనితో ఆమె మెడిసిన్ తీసుకుని విశ్రాంతి తీసుకుంది. మహిళా అధికారి నిద్ర పోతున్న సమయంలో ఎవరో ఆమెపై హత్యాచారం చేశారు. నిద్ర లేవగానే ఆమెకు విషయం అర్థమయింది. అయితే ఈ విషయం పట్ల క్యాంపస్ అధికారులు చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు ఈ కేసు గాంధీ పురం మహిళ పోలీస్ స్టేషన్ లో ఫైల్ అయింది.

విచారణలో తెలిసిన సమాచారం ప్రకారం, నిందితుడు ఛత్తీస్గఢ్ కు చెందిన ఫ్లైట్ లెఫ్టినెంట్ అమ్రిందర్ అని తెలుసుకున్నారు. దీనితో అతనిని అరెస్ట్ చేశారు. కానీ ఇతనిని పోలీసులు డైరెక్ట్ గా విచారణ చేయకూడదని నిందితుడు తరపు న్యాయవాది చెప్పడంతో అతనిని కోర్టు లోనే విచారించనున్నారు. ఇతనిపై ఐపిసి సెక్షన్ 376 కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అమ్రిందర్  ఉడుమల్ పేట జైల్ లి ఉన్నారు. అమరీందర్ ను ఉరితీయాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: