తెలుగుదేశం పార్టీ. జనసేన పార్టీల మధ్య పొత్తు కుదిరిందా... ఈ రెండు పార్టీలు కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నాయా... ఇప్పటికే... రెండు పార్టీలు నేతలు ఓ అవగాహనకు వచ్చారా... అంటే... పరిస్థితులు అవుననే అనిపిస్తున్నాయి. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి పోటీ చేశాయి. అయితే ఆ ఎన్నికల్లో జనసేన పార్టీ ఒక్కచోట కూడా పోటీ చేయలేదు. కనీసం ఆ పార్టీ అధినేత కూడా ఎన్నికల బరిలో నిలబడలేదు. కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే... తెలుగుదేశం పార్టీ బెటర్ అని ప్రచారం చేశారు జనసేనాని  పవన్ కల్యాణ్. అయితే ఎన్నికల తర్వాత రాజధాని అమరావతి కోసం చేపట్టిన భూసేకరణపై చంద్రబాబు ప్రభుత్వంపై పవన్ ఎదురుదాడి చేశారు. రైతులతో కలిసి ధర్నా చేశారు. ప్రత్యేక హోదా కోసం విశాఖలో నినాదాలు చేశారు. చివరికి టీడీపీతో ఢీ అంటే ఢీ అనే పరిస్థితికి దిగింది జనసేన పార్టీ.

ఆ తర్వాత జరిగిన 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగానే పోటీ చేసింది. ఫలితాల తర్వాత తెలుగుదేశం పార్టీ ఏకాకిగా మిగిలిపోగా... జనసేన పార్టీ మాత్రం.. భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంది. ఏడాదిన్నర పాటు రెండు పార్టీల మధ్య పొత్తు కొనసాగింది. ఇదే సమయంలో పరిషత్ ఎన్నికల ఫలితాలు మరో చర్చకు దారి తీస్తున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో చాలా చోట్ల ఎంపీటీసీ స్థానాలను జనసైనికులు గెలుచుకున్నారు. వైసీపీని అడ్డుకోవాలంటే... పొత్తులు తప్పని సరి అని భావించిన ఇరు పార్టీల నేతలు... ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు బీజేపీని కాదని... టీడీపీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుంది జనసేన. ఉభయ గోదావరి జిల్లాల్లో దాదాపు 8 ఎంపీపీలను జనసేన, టీడీపీ సొంతం చేసుకున్నాయి. ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వంపై పవన్ ఎదురుదాడి ప్రారంభించారు. దీంతో... రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు ఉంటుందని అంతా భావిస్తున్నారు. సీట్ల పంపకం కూడా పూర్తయినట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. చూడాలి మరి... ఏది నిజమో... ఏది పుకారో...


మరింత సమాచారం తెలుసుకోండి: